సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ నేతలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి వారితో ప్రమాణం చేయించారు. వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న (కృష్ణా), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), రెడ్డి సుబ్రమణ్యం (తూర్పు గోదావరి), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించటంతో పాటు వాటి పరిష్కారానికి, టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. లోకేష్ అడుగుజాడల్లో.. ఆయన సైన్యంలో పనిచేస్తామని వ్యాఖ్యానించారు.
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
Published Wed, Jun 24 2015 12:56 AM | Last Updated on Fri, Aug 10 2018 7:13 PM
Advertisement
Advertisement