rural mlc elections
-
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ నేతలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి వారితో ప్రమాణం చేయించారు. వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న (కృష్ణా), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), రెడ్డి సుబ్రమణ్యం (తూర్పు గోదావరి), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించటంతో పాటు వాటి పరిష్కారానికి, టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. లోకేష్ అడుగుజాడల్లో.. ఆయన సైన్యంలో పనిచేస్తామని వ్యాఖ్యానించారు. -
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
-
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
ప్రకాశం: స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడంపై ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ఓటుకు కోట్లు కేసు నడుస్తున్నా కుక్క తోక వంకరన్నట్టు టీడీపీ బుద్ధి మారలేదని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచేశారు. దీన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసివెళ్లి ఎంపీటీసీలను పక్కగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఓ పక్క ఓటుకు నోటు కేసులో పీఠం కదిలిపోతున్న అధికార టీడీపీకి సిగ్గురావడం లేదని విమర్శించారు. అయితే తాము మొదటి నుంచి అనుమానించినట్లే.. తమ సభ్యులను ప్రలోభపెట్టి టీడీపీ క్యాంప్‌కు తరలించదంటూ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రకాశం జిల్లాకు చెందిన తమ ఎంపీటీసీలను నెల్లూరు లాడ్జీలో నిర్భంధించారని చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలపై ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ నేతలపై చర్య తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.