
సాక్షి, అమరావతి: ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విమరణకు దరఖాస్తు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఆయన
కొనసాగుతున్నారు. అనంతరం లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారన్నని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎస్ రాజకీయ అరంగేట్రంపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరినా, లేక సొంతంగా పార్టీ పెట్టినా ప్రతిపక్షాల ఓట్లు చీల్చుకోవడానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెప్పారు.
ఆ అధికారి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో జేపీ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చినా ప్రతిపక్షాలకే నష్టం కలుగుతుందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment