lakshminarayana
-
చిన్ని గుండెకు పెద్ద కష్టం
జీడిమెట్ల (హైదరాబాద్): బాబు పుట్టగానే తల్లి చనిపోయింది.. నాన్న రెండో పెళ్లి చేసుకుని బంధాన్ని తెంచుకున్నాడు. చివరకు అమ్మమ్మ సుబ్బలక్ష్మి అక్కున చేర్చుకుని వృద్ధాప్యంలోనూ అట్టల పరిశ్రమలో పనిచేస్తూ అన్నీ తానై సాకుతోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బాబుకు ఉహించని విపత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చి పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న నూకల లక్ష్మీనారాయణ (15) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం బాబుకు ఛాతీలో నొప్పి రావడంతో అమ్మమ్మ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఆయన సూచన మేరకు మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబుకు అపరేషన్ చేయాలని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబును అమ్మమ్మ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అరోగ్యశ్రీ లేదని తిప్పి పంపించారు. అనంతరం బాబును రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాబు గుండె నుంచి వచ్చే నాళానికి రంధ్రం పడిందని, ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఐదు రోజుల్లో బాబుకు అపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని అమ్మమ్మ కంట నీరు పెట్టడమే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె అందరి కాళ్ల మీద పడి తన మనవడిని రక్షించాలని రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఆమె అట్టల కంపెనీలో పనిచేస్తే నెలకు రూ.7 వేలు వస్తుంది. ఇంటి అద్దె రూ.2,500 పోను మిగిలిన సొమ్ముతోనే మనవడిని చదివిస్తూ తిండిపెట్టాలి. దీంతో దాతల సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తుంది. బాలుడికి ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు 9177376666 (సాయి), 912159 3999(కృష్ణ)లను సంప్రదించవచ్చు.అకౌంట్ నంబర్: 240810100015391 పేరు: చింతలపూడి రామకృష్ణ, బ్యాంక్: యూనియన్ బ్యాంక్, బ్రాంచ్: అపురూపా కాలనీ, ఐఎఫ్ఎస్సీ కోడ్: UBIN0824089 -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
సాక్షి, అమరావతి: ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి వైఎస్సార్సీపీలో చేరారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. లక్ష్మీనారాయణశాస్త్రి గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. అలాగే నెల్లూరుకు చెందిన నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరు రూరల్, అర్బన్‌తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడిగా కోటారెడ్డికి గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హిందూపురం: నిమ్మల వర్సెస్ అంబికా..
సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గాల నుంచి పలువురు హిందూపురం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారు టీడీపీ పెద్దలను కలిసి లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. అయితే వీరిలో ఎవరిని బరిలో దింపినా...మిగతా వారితో ఇబ్బందే అన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తోంది. హిందూపురం పార్లమెంటులో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, సొంత కేడర్ లేని వ్యక్తికి టికెట్ ఇస్తే అంతేసంగతులని ఆశావహులు అధిష్టానం వద్ద తమ అభిప్రాయం తెలిపినట్లు సమాచారం. అందరి పరిస్థితీ అంతంతే.. హిందూపురం పార్లమెంటు సీటుకు టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ సొంత ఓటు బ్యాంకు లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ బలంపై ఆధారపడాల్సిన పరిస్థితి. కనీసం వారి కులాల నుంచి కూడా సరైన మద్దతు లేదనేది స్పష్టం అవుతోంది. ఆయా కులాల ఓటు బ్యాంకు టీడీపీ కంటే వైఎస్సార్సీపీకే బలంగా ఉండటం విశేషం. వైఎస్సార్ సీపీ గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు బీసీలకే ఇవ్వగా, ఈ సారి టీడీపీ తరఫున బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. అయితే ఆయా కులాలకు వైఎస్సార్సీపీ ఎనలేని గుర్తింపు ఇచ్చింది. నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యాధికారం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ఓటర్లు ఎవరూ టీడీపీ వైపు మొగ్గుచూపడం లేదని అధిష్టానికి తెలిసిపోయింది. దీంతో వారికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మల వర్సెస్ అంబికా.. 2009లో కాంగ్రెస్ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంబికా లక్ష్మీనారాయణ ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయనకు ఇప్పటివరకు ఒకసారి కూడా టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు సొంత కులంలో బలం లేదని సమాచారం. మరోవైపు బోయ సామాజిక వర్గంలో చాలా మంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తుండటం తెలిసిందే. ఇక నేసే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎంపీ సీటుకు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. లేదంటే తనకు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. నిమ్మల కూడా ఆ సామాజిక వర్గంలో పెద్దగా ప్రభావం చూపించలేరని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. రేసులో మరికొందరు.. హిందూపురం ఎంపీ స్థానం నుంచి అంబికా, నిమ్మలతో పాటు పుట్టపర్తికి చెందిన సామకోటి ఆదినారాయణ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే కనీసం ఎంపీ సీటైనా ఇవ్వాలని ఇటు సవితమ్మ అటు బీకే పార్థసారథి కోరుతున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం నుంచి ఎవరికీ హామీ దక్కలేదని సమాచారం. బీసీ కులాల నుంచి సమర్థుడు దొరకడం లేదని పార్టీ పెద్దలు చర్చించుకున్నట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. వెంటాడుతున్న ఓటమి భయం.. ఓటమి భయంతో కొందరు టీడీపీ నేతలు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టికెట్ రేసులో ఉన్నవారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరోవర్గం అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా చెబుతున్నారు. గ్రూపు రాజకీయాలతో పోటీలో ఉన్న వారు బలి కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పురం’ ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలో నిలపాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. -
టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు
పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై శుక్రవారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు. సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్కడ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచయం పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు. అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితురాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధితురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యాయమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నిందితుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణిప్రసాద్ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. -
నిజాంను ఎదిరించిన యోధుల కుటుంబ సభ్యులకు సన్మానం
రసూల్‌పురా (హైదరాబాద్): నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల కుటుంబ సభ్యులను తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో సన్మా నిస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న విమోచన దినోత్సవ కార్యక్రమానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడం లేదని, దీంతో ఈ యేడు కూడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంపై పోలీసులు, ఒక పార్టీ మీటింగ్ తరహాలో సర్క్యులర్ జారీ చేశారని, దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజాం పాలనలో పోరాటాలు, ప్రజల కష్టాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్చువల్గా ఎగ్జిబిషన్, నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్, గిరిజన యోధుడు రామ్‌జీ గోండు పేర్ల మీద పోస్టల్ కవర్ విడుదల చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తే తమ నాయకులను, కార్యకర్తలను కొట్టి జైల్లో వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ విమోచన వేడుకలు నిర్వహించలేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రజాకార్ల వారసుల పార్టీతో కలసి చరిత్రను తెలియనివ్వలేదని విమర్శించారు. బీజేపీలోకి ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ సాక్షి, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్‌నేత ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మీనారా యణకు కండువా కప్పి లక్ష్మణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఆ యన కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేశారు. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
పుత్తూరు రూరల్ (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం దొరికిపోయారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరితోపాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్చార్జి డీఎస్పీ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు పట్టణంలోని స్వర్ణా హౌసింగ్ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ లక్ష్మీనారాయణ అక్కడికి సిబ్బందితో వెళ్లారు. ముళ్ల పొదల మధ్యలో 8 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోబోగా, ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో నాగలాపురం మండలం వినోబానగర్‌కు చెందిన ఎ.విజయభాస్కర్ (22), నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కె.యూకేష్ (21), పుత్తూరుకు చెందిన కాశీం మస్తాన్ (29), టి.సందీప్‌కుమార్ (27), సి.ఎం.శరవణ (35), బి.ఎస్.హరికృష్ణ అలియాస్ హరి (30) ఉన్నారు. వీరి నుంచి రూ.2.52 లక్షలు విలువ చేసే 21.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన వెంకటేష్ వద్ద గంజాయిని కొని పుత్తూరులో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. పరారైన మోనిష్, బాలుతో పాటు అరకుకు చెందిన వెంకటేష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్టు పెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలోనూ అరెస్టయిన హరికృష్ణ అరెస్టయిన వారిలో హరికృష్ణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో పుత్తూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. శరవణ ప్రస్తుతం టీడీపీ పుత్తూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు. గత ఏడాది జనవరి 10న విజయనగరం జిల్లా కాపుసోంపురం వద్ద 28 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో హరికృష్ణ రెండో నిందితుడు. అదే రోజు అరెస్టయిన వారిలో మరో టీడీపీ నాయకుడు హేమంత్ మూడో నిందితుడు. ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన హరికృష్ణ మరోసారి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. -
ఈడీ విచారణకు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ
-
ఇందూరు బీజేపీలో ఇంటిపోరు.. ఎంపీ అరవింద్‌ను టార్గెట్ చేశారా?
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయాల్లో అలజడి పెరుగుతోంది. పోటీ చేయాలనుకునేవారిలో టెన్షన్ మొదలవుతోంది. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. నిజామాబాద్ కమలం పార్టీలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి సిటింగ్ ఎంపీకి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఎంపీ అరవింద్ వర్సెస్ యెండల.. నిజామాబాద్ జిల్లా కాషాయ సేనలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. సిటింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీలో యెండల రాష్ట్ర నాయకుడైనా.. స్థానికంగా ఎంపీ అరవింద్ హవా ముందు ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య చాన్నాళ్ళుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. యెండల ప్రధాన అనుచరుడిగా ఉన్న ప్రసాద్ పటేల్‌పై వచ్చిన ఆరోపణలతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పటేల్‌పై వేటు వేయడానికి అరవింద్ కారణమని యెండల వర్గీయుల ఆరోపణ. ప్రసాద్ పటేల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. అతను తన హిందూత్వను వదల్లేదు. గోరక్షణ కోసం, లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. సున్నితమైన అంశాల్లో వీధికెక్కి పోరాడటం, సోషల్ మీడియాలో పోస్టులతో ఆయన మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. బల ప్రదర్శనలకు సై.. తన అనుచరుడైన ప్రసాద్ పటేల్ అంశాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల అనేకసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం బీజేపి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ర్యాలీ బయటకు చూస్తే ప్రసాద్ పటేల్‌పై పెట్టిన కేసులను ఎత్తేయాలని పోలీసులను డిమాండ్ చేయడంతో పాటు.. యెండల బలప్రదర్శన అనే వాదన ఇప్పుడు నిజామాబాద్‌లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా లేదా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న యెండల స్థానికంగా తన ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వేళ.. ప్రసాద్ పటేల్ అంశాన్ని ఎజెండాగా తీసుకుని పోలీసుల పేరుతో అధికార పార్టీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసినప్పటికీ అందులో అంతర్లీనంగా తన స్టామినా చాటుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎవరికి ఎవరు చెక్? తనకు చెక్ పెట్టాలనుకుంటున్న ఎంపీ అరవింద్‌కు తానేంటో చూపించడానికే యెండల ఈ ర్యాలీని ఉపయోగించుకున్నారని నిజామాబాద్‌లో టాక్. ఆర్మూర్ నుంచి అరవింద్ అసెంబ్లీ బరిలోకి దిగుతాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. గతంలో అక్కడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఈసారి అరవింద్ వల్ల తనకు టిక్కెట్ రాదేమో అన్న అనుమానంతో ఉన్న వినయ్ రెడ్డి వంటి నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకే పార్టీలో ఉంటూ, ఒకే ప్రాంతానికి చెందిన నాయకుల మధ్య వైరం పార్టీకి మంచిది కాదని కమలం నేతలు సలహా ఇస్తున్నారట. అయితే రాజకీయ ఉనికి చాటుకునే సందర్భంలో ఇటువంటి పోరాటాలు, వైరాలు తప్పవంటున్నారు. -
హత్య కేసులో నలుగురికి యావజ్జీవ ఖైదు
జగిత్యాలజోన్: ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాదితో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పునిచ్చారు. అలాగే రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తిర్మణి మోహన్‌రెడ్డి 2012 మే 7వ తేదీన పొలం నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు, న్యాయవాది రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డి, తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశారు. తర్వాత విచారణలో ఈ హత్యతో సంబంధం లేదంటూ తిరుమణి జలపతి, తిరుమణి తిరుపతి, ముంజ భూమయ్య, ముంజ మల్లేశం, రాచకొండ లక్ష్మీనారాయణల పేర్లను చార్జీ షీట్ సమయంలో పోలీసులు తొలగించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ బాపురెడ్డి హత్య కేసులో మృతుడు మోహన్‌రెడ్డి, రాచకొండ గంగారెడ్డి కుటుంబాల మధ్య పాత పగలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే మోహన్‌రెడ్డి హత్య జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి సుదర్శన్.. రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, పన్నాల మహేశ్, తిరుమణి నరసింహారెడ్డికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో ఎ–3గా ఉన్న రాచకొండ అంజిరెడ్డి కోర్టు విచారణ సమయంలోనే మరణించడంతో ఆయన పేరును కేసునుంచి తొలగించారు. -
ఫిల్మ్ జర్నలిస్టుల కోసం అండగా...
కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్ జర్నలిస్టులకు ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) అండగా ఉంటుందని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది ఫిల్మ్ జర్నలిస్టులకు టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో 30 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రెస్‌మీట్స్‌కి హాజరయ్యే విలేకరులకు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు టీఎఫ్జేఏ అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనేది సంస్థ ముఖ్యోద్దేశం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులు టీఎఫ్జేఏని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్..టీడీపీ నేత ఇంటికి నోటీసులు
-
అందమైన చిత్రాలు వేస్తారు.. నలుగురికి నేర్పిస్తారు
-
టీడీపీ, జనసేనకు మీరు జాయింట్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయ సాయిరెడ్డి శనివారం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జేడీ గారూ.. మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసిందే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చింది 175లో 65 బీఫామ్‌లు. కాదు మొత్తం తెలుగుదేశం చెబితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘జేడీ గారూ.. మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. పాపం! బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మద్దతు మాత్రం మీకివ్వాలని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు’ అని నిలదీశారు. ‘జేడీ గారూ.. మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి.. నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి.. ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు? లక్ష్మీనారాయణ గారూ.. మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి – జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ల పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!’ అంటూ విజయసాయి రెడ్డి ఎత్తిపొడిచారు. -
‘చంద్రబాబు–లక్ష్మీనారాయణ తోడుదొంగలు’
సాక్షి, హైదరాబాద్: ‘‘సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) లక్ష్మీనారాయణ.. చంద్రబాబు నాయుడు అప్పట్లో తోడు దొంగలుగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నించారు. వాళ్లిద్దరి మధ్య ఇన్నాళ్లూ సాగిన రహస్య బంధాలపై విచారణ జరపాలి. అప్పుడు వారి ముసుగు తొలిగి మరిన్ని నిజాలు బయటపడతాయి. చిత్తశుద్ధి ఉంటే వారిద్దరూ విచారణకు సిద్ధంగా ఉండాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్న వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళ్తున్న వ్యక్తిని ఎంతో దుర్మార్గంగా వేధించిన వారిని ప్రజలు శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓటునే ఆయుధంగా ఉపయోగించి, బ్యాలెట్ ద్వారా శిక్షించాలని పిలుపునిచ్చారు. నిజానికి ఆ కేసుల్లో విచారణ జరగాల్సింది జగన్మోహన్రెడ్డిపై కాదని, లక్ష్మీనారాయణ, చంద్రబాబుపైనే జరగాలని స్పష్టం చేశారు. జగన్‌ను అణగదొక్కడానికి కుట్ర ‘‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను రాజకీయంగా అణగదొక్కడానికి ఎనిమిదేళ్లపాటు టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేశాయి. విచారణ పేరుతో జగన్‌ను జైలులో పెట్టించారు. కుట్రపూరితంగా చంద్రబాబు ఏది ఆదేశిస్తే లక్ష్మీనారాయణ అదే చేశారు. టీడీపీ నేతలు, వారి అనుకూల పత్రికలు లక్ష్మీనారాయణను గొప్పగా చిత్రీకరించాయి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సైకిలెక్కి భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. దీన్నిబట్టి వారి బంధం ఏనాటిదో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ను అణచివేసేందుకు జరిగిన కుట్రలో లక్ష్మీనారాయణది ప్రధాన పాత్ర’’ అని అంబటి విమర్శించారు. జగన్‌ను వేధిస్తే వైఎస్సార్సీపీ ఉండదనుకున్నారు ‘‘జగన్మోహన్రెడ్డిని వేధించి, కుట్రలు చేసి కేసులు పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిరైపోతుందని భావించారు. కానీ, చంద్రబాబు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేకపోయారు. ఎంతగా వేధించినా మొక్కవోని ధైర్యంతో పార్టీ ముందుకు సాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, జగన్ కష్టం, కార్యకర్తల కృషి ఇందుకు కారణం. అప్పట్లో ఆ రెండు పత్రికలు వాస్తవాలను అవాస్తవాలుగా... అవాస్తవాలను వాస్తవాలుగాను వండి వార్చాయి. ఆ రెండు పత్రికలు చంద్రబాబుకు బాకా ఊదే పత్రికలనే విషయం అందరికీ తెలుసు’’ అని అంబటి పేర్కొన్నారు. -
హత్య కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం
-
నన్ను చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు
రైలుపేట (గుంటూరు): తనను చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం గూండాలను పంపిందని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తన ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించిన నేపథ్యంలో కన్నా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వివరాలు.. గుంటూరు కన్నావారితోటలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని విజయవాడ నుంచి వచ్చిన టీడీపీ నేతలు శనివారం ఉదయం ముట్టడించారు. సుమారు గంటసేపు ఆయన ఇంటి ఎదుట బైఠాయించి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో కన్నాతో పాటు మరో ఇద్దరు మాత్రమే ఇంటిలో ఉన్నారు. ముట్టడి విషయం తెలిసి పోలీసులు వచ్చినా.. టీడీపీ వారిని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో కన్నా కూడా వారికి ఎదురుగా కూర్చున్నారు. బీజేపీ యువమోర్చా నేతలు టీడీపీ నేతలను అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో మరింత మంది పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని లాడ్జిసెంటర్ నుంచి శంకర్‌విలాస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం నగరంపాలెం పోలీసు స్టేషన్ వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, కన్నాను చంపుతామంటూ బెదిరిస్తూ.. ఇంటిపైకి రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు నగరంపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, ఈ ఘటనను కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్‌పై విశాఖలో కత్తితో దాడిచేశారని నేడు తనను చంపేందుకు ప్రయత్నించారన్నారు. -
గతంలో జేపీ.. ఇప్పుడు లక్ష్మీనారాయణ!
సాక్షి, అమరావతి: ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విమరణకు దరఖాస్తు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఆయన కొనసాగుతున్నారు. అనంతరం లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారన్నని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎస్ రాజకీయ అరంగేట్రంపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరినా, లేక సొంతంగా పార్టీ పెట్టినా ప్రతిపక్షాల ఓట్లు చీల్చుకోవడానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెప్పారు. ఆ అధికారి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో జేపీ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చినా ప్రతిపక్షాలకే నష్టం కలుగుతుందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
హిందూపురం రూరల్ : మండలంలోని అప్పులకుంట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (30) బెంగుళూరు నిమాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మతి చెందినట్లు బంధువులు తెలిపారు. గత బుధవారం హిందూపురం నుంచి అప్పులకుంటకు ద్విచక్రవాహనంలో వస్తుండగా ఆటోనగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మతి చెందాడు. -
కార్మిక సంక్షేమానికి కృషి చేయాలి
సిద్దిపేట జోన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గురువారం శ్రామిక భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వద్ద నుంచి వసూలు చేస్తున్న సెస్‌ను వారి శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి వేతనం చెల్లించాలన్నారు.ఈఎస్ఐ , పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి?
పై ఫోటోలో కింద వరుసలో కూర్చున్న బాలుడు (సర్కిల్) ఎవరో గుర్తు పట్టండి. గుర్తు పట్టలేదా? ఇంకాస్త దగ్గర నుంచి చూడండి. గుర్తు పట్టలేకపోతున్నారా? అయితే మీకో క్లూ ఇస్తాం...కనుక్కోండి! ఓ మాజీ ప్రధానమంత్రిని ఉద్దేశించి 'ఆయన కంటే చెప్రాసీలు నయం' అని ఒకసారి...'ఆంధ్రోళ్లు ఆఫీసర్స్, తెలంగాణోళ్ళు చెప్రాసీలా?' అంటూ మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుకొచ్చిందా...! అవును మీరు అనుకున్నంటున్న పేరు నిజమే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్. 48 ఏళ్ల కిందట ఏక్ దిన్కా చెప్రాసీగా పని చేశారు. 1967-68 విద్యా సంవత్సరంలో స్వపరిపాలన రోజు కేసీఆర్ అటెండర్ పాత్ర పోషించారట. అప్పుడాయన దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు పాఠశాల రికార్డులను బట్టి తెలుస్తోంది. నెత్తిమీద ఖద్దరు టోపీ... చంకలో అటెండెన్స్ రిజిష్టార్ పట్టుకుని పెద్దసారు (హెడ్ మాస్టర్) ముందు నడుచుకుంటూ వచ్చి టేబుల్ పై పెడుతూ ఆనందపడేవారని ఆయన బాల్య స్నేహితులు చెప్తున్నారు. కేసీఆర్ సొంత ఊరు చింతమడక నుంచి దుబ్బాక హైస్కూల్‌కు తన సోదరి సుమతితో కలిసి నడుచుకుంటూ వచ్చేవారని కేసీఆర్ సీనియర్ స్టూడెంట్ లక్ష్మీనారాయణ 'సాక్షి'తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆనాటి స్వపరిపాలన మధుర క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.