పరేడ్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాట్లను పరీశీలిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
రసూల్‌పురా (హైదరాబాద్): నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల కుటుంబ సభ్యులను తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో సన్మా నిస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న విమోచన దినోత్సవ కార్యక్రమానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడం లేదని, దీంతో ఈ యేడు కూడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంపై పోలీసులు, ఒక పార్టీ మీటింగ్ తరహాలో సర్క్యులర్ జారీ చేశారని, దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నిజాం పాలనలో పోరాటాలు, ప్రజల కష్టాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్చువల్‌గా ఎగ్జిబిషన్, నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్, గిరిజన యోధుడు రామ్‌జీ గోండు పేర్ల మీద పోస్టల్ కవర్ విడుదల చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తే తమ నాయకులను, కార్యకర్తలను కొట్టి జైల్లో వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ విమోచన వేడుకలు నిర్వహించలేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రజాకార్ల వారసుల పార్టీతో కలసి చరిత్రను తెలియనివ్వలేదని విమర్శించారు.
బీజేపీలోకి ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్‌నేత ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మీనారా యణకు కండువా కప్పి లక్ష్మణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఆ యన కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment