వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు | Congress leaders join YSRCP: andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

Published Wed, Mar 20 2024 5:59 AM | Last Updated on Wed, Mar 20 2024 11:39 AM

Congress leaders join YSRCP: andhra pradesh - Sakshi

మద్దిరెడ్డి, రావూరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనిస్తున్న సీఎం జగన్‌    

సీఎం జగన్‌ సమక్షంలో చేరిన మద్దిరెడ్డి జగన్, రావూరు లక్ష్మీనారాయణశాస్త్రి

నెల్లూరుకు చెందిన మలిరెడ్డి కోటారెడ్డి కూడా..

సాక్షి, అమరావతి: ఏపీసీసీ జనరల్‌ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీ­నారాయణ శాస్త్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మద్ది­రెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు.

లక్ష్మీనారాయణశాస్త్రి గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌­సీపీ అభ్యర్థి షేక్‌ నూరి ఫాతిమా తదిత­రులు పాల్గొన్నారు. అలాగే నెల్లూరుకు చెందిన నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమ­క్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నెల్లూరు రూరల్, అర్బన్‌తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడిగా కోటారెడ్డికి గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement