'మేం సైలెంట్గా ఉన్నామని అనుకోవద్దు' | gali muddu krishnama naidu takes on BJP Leaders | Sakshi
Sakshi News home page

'మేం సైలెంట్గా ఉన్నామని అనుకోవద్దు'

Published Thu, May 5 2016 5:57 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

'మేం సైలెంట్గా ఉన్నామని అనుకోవద్దు' - Sakshi

'మేం సైలెంట్గా ఉన్నామని అనుకోవద్దు'

తిరుపతి: బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని బీజేపీ వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్జైట్లీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని వారిపై గాలి ముద్దు కృష్ణమ నాయుడు మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. మిత్రపక్షమే కదా అని టీడీపీ సైలెంట్గా ఉందని అనుకోవద్దని బీజేపీ నాయకులను గాలి హెచ్చరించారు. హోదా ఇవ్వని పక్షంలో వెంకయ్య, జైట్లీ పదవుల నుంచి దిగిపోవాలని గాలి డిమాండ్ చేశారు. అయితే.. బీజేపీ మంత్రుల గురించి మాట్లాడిన ముద్దు కృష్ణమ.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement