రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. రెండురోజుల క్రితం పయ్యావుల కేశవ్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పయ్యావుల సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలా? లేదా? అనే సంగిద్ధంలో పడ్డా. స్పందించపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే మాట్లాడుతున్నా. 25 ఏళ్లుగా పార్టీ ఎజెండానే నా ఎజెండాగా పనిచేశా. పార్టీకి నష్టం చేకూర్చే పని నేనెప్పుడు చేయలేదు. రేవంత్ ఆరు నెలలుగా చేస్తున్న ఢిల్లీ పర్యటన వివరాలు నా దగ్గర ఉన్నాయి. అయినా నేను స్పందించలేదు. కాంగ్రెస్‌లో చేరిక ఊహాగానాలపై నాకు తెలుసు....కానీ ఇప్పుడు మాట్లాడను.