'పయ్యావుల కేశవ్ ను అరెస్ట్ చేయండి'
అనంతపురం: దళితులపై దాడి చేసిన పయ్యావులను అరెస్ట్ చేయాలని దళిత సంఘం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి దళిత సంఘం నేతలు పయ్యావులపై ఫిర్యాదు చేశారు. ఉరవకొండ ప్రాంతంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వారన్నారు. పయ్యావుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్క్షప్తి చేశారు. అంతేకాకుండా నాగన్న కుటుంబంపై దాడి చేసిన కేసునమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే ఉరవకొండలో పయ్యావులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని దళిత సంఘం నేతలు ఆరోపించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన దళిత సంఘం నేతల్లో శ్రీనివాస్, పెన్నోబులేసు ఉన్నారు. మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ ప్రశ్నించిన పాపానికి గ్రామస్థులపై మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.