‘‘ సీఎం, స్పీకర్‌లు చేసింది పనికిమాలిన చర్య. సొంతపార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దోపిడీ దొంగల్లా వ్యవహరించారు. స్పీకర్‌కు తెలంగాణవాదులు బుద్ధి చెప్తారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ ఏర్పడుతుంది’’
- కేటీఆర్ (టీఆర్ ఎస్)
‘‘మూడు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయాన్ని వెలువరించేలా కాంగ్రెస్, బీజేపీలు కృషి చేయాలి. తెలంగాణ ఏర్పాటుకు సమగ్ర పరిష్కారాన్ని మా పార్టీ చూపింది. సవరణలతో కూడిన బిల్లుతో సీమాంధ్రకు న్యాయం చేయాలి.’’ - జ యప్రకాశ్ నారాయణ్ (లోక్‌సత్తా)
‘‘తెలంగాణ బిల్లును ఓడించి పంపించాం. నేటి పరిణామాలు చరిత్రలో నిలిచిపోతాయి’’ - పయ్యావుల కేశవ్ (టీడీపీ)
‘‘తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయం. సీఎం కిరణ్ పిరికిపందలా సభలో లేకుండా పారిపోయారు.’’
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్
‘‘తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోంది. బిల్లు రాష్ట్రపతికి వెళ్లడం సంతోషం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. సభలో స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు.’’
- ఈటెల రాజేందర్ (టీఆర్‌ఎస్)
‘‘స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఆంధ్ర నాయకులంతా ప్రజాస్వామ్య ద్రోహులుగా మిగిలారు. నైతిక విజయం మాదే.’’
- ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీతక్క (టీడీపీ)
‘‘సీమాంధ్ర నాయకుల సంబరాలు చూస్తుంటే వారికి పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్, సీఎం కిరణ్ ఇద్దరూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు. బిల్లు పార్లమెంటులో నెగ్గడం ఖాయం.’’
- గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
‘‘సభలో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బిల్లును తిరస్కరించే హక్కు సభకు లేదు. ఓటింగ్, తీర్మానాలు చేసే అధికారంలేదు. పార్లమెంటులో బిల్లును బీజేపీ నెగ్గిస్తుంది.’’
- నాగం జనార్దన్‌రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ)
‘‘బిల్లు విషయంలో అసెంబ్లీ వెల్లడించేది అభిప్రాయాలు మాత్రమే. అంతిమ నిర్ణయం పార్లమెంట్‌దే’’ - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
‘‘ఆఖరి బంతికి 5 రన్స్ చేయాల్సి ఉండగా.. సీఎం కిరణ్ సిక్స్ కొట్టారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజారంజకం’’ - ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్)
అసెంబ్లీ మీడియా పాయింట్
Published Fri, Jan 31 2014 2:52 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement