పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి: ఎర్రబెల్లి
పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి: ఎర్రబెల్లి
Published Thu, Oct 31 2013 1:06 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
టీడీపీని ఇరుకున పెట్టేందుకే మళ్లీ అఖిల పక్షం నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఉంటుందన్న వార్తలపై టీడీపీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం టీడీపీని ఒప్పించాం అని అన్నారు.
అఖిలపక్షానికి టీడీపీ వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు. అఖిల పక్షానికి ఇరు పార్టీల జేఏసీలు వెళితే సరిపోతుంది ఆయన సూచించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అఖిల పక్షం భేటి, తాజా రాజకీయాలపై చర్చ చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిని ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా... వ్యక్తిగతంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను అని పయ్యావుల కేశవ్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని బుధవారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.
Advertisement