
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రదర్శించిన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. గురువారం రాత్రి హంద్రీనీవా నుంచి ఇప్పేరు చెరువుకు నీటి సరఫరాను టీడీపీ నేతలు నిలిపివేయించారు. ఇప్పేరు చెరువుకు స్వయంగా నీరు విడుదల చేసేందుకే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పయ్యావుల వైఖరికి నిరసనగా కూడేరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడేరుకు రాకుండానే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెనుదిరిగారు.