enthusiasm
-
అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్‌రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ఎస్పీ.. ‘‘జయహో జగదీష్‌రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రదర్శించిన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. గురువారం రాత్రి హంద్రీనీవా నుంచి ఇప్పేరు చెరువుకు నీటి సరఫరాను టీడీపీ నేతలు నిలిపివేయించారు. ఇప్పేరు చెరువుకు స్వయంగా నీరు విడుదల చేసేందుకే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పయ్యావుల వైఖరికి నిరసనగా కూడేరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడేరుకు రాకుండానే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెనుదిరిగారు. -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. -
వైఎస్సార్ నాయకులను ‘తోసేయండి’
పటమట(విజయవాడ ఈస్ట్): కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంపై మృతుల బంధువులను పరామర్శించటానికి వచ్చే రాజకీయ పార్టీల నాయకులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం జారీ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, జోగి రమేష్‌లు రాగా అక్కడే ఉన్న బుద్దా వెంకన్న పోలీసులకు వారిపై ఉసుగొలిపారు. నాయకులు అక్కడికి చేరుకుంటుండగా సీపీ ‘తోసేయండి’ అంటూ ఆదేశించారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌కు పరాభవమే.. ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధనేకుల మురళి, మ హిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశీ, మీసాల రాజేశ్వరరావు పరామర్శించటానికి రాగా అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు ఫూటుగా మద్యం తాగి పీసీసీ నాయకులకు అడ్డుపడ్డారు. దీంతో వీరి వెంటనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయటంతో పోలీసులు అక్కడి నుంచి కంచికచర్లకు చెందిన నాయకుడిని పంపించి వేశారు. -
విజయవాడలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం
-
ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు
కుంకలగుంట (నకరికల్లు): జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు కుంకలగుంటలో ఘనంగా నిర్వహించారు. కుంకలగుంట పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు జరిగిన పోటీలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట), గోళ్లపాడు ముప్పాళ్ల, వాగ్దేవి గోల్డెన్బాయ్స్ (నరసరావుపేట) జట్లు విజేతలుగా నిలిచి లీగ్మ్యాచ్లలో ప్రవేసించాయి. రెండురోజు ఫైనల్ పోటీలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఉత్కంఠ రేపుతున్న తొలి టెస్టు
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మంచి రసకందాయంలో పడింది. ఆడుతున్నది టెస్టు మ్యాచా.. టి-20నా అన్నట్లుగా ఉంది. ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని 290 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత జట్టు ముందు కేవలం 364 పరుగుల ఊరించే విజయలక్ష్యాన్ని ఉంచాడు. అడిలైడ్ పిచ్ మీద ఒక్కోరోజు 350 నుంచి 400 వరకు కూడా పరుగులు వస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లీ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ ఉండగా మైఖేల్ క్లార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రెండు రోజుల ఆట చూసినప్పుడు ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అవ్వాల్సిందేనన్న వాళ్లు ఇప్పుడు నరాలు బిగబట్టుకుని ఉత్కంఠగా టీవీలకు అతుక్కుపోయారు. తొలి రెండు వికెట్లను 60 పరుగుల లోపే కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయి ఆడుతోంది. ఒకవైపు ఓపెనర్ మురళీ విజయ్, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటా పోటీగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కాలి కండరాలు మరోసారి పట్టేశాయి. దాంతో హాడిన్స్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేసి తాను మైదనాం వదలి వెళ్లిపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడే క్లార్క్ రిడైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోడానికి భారత బ్యాట్స్‌మన్ ఏమాత్రం వెనకాడలేదు. మొదటి వికెట్‌ను 16 పరుగులకే కోల్పోయినా, రెండో వికెట్ 57 పరుగుల వద్ద పడినా మురళీ విజయ్, కోహ్లీ ఏమాత్రం మనో నిబ్బరం కోల్పోలేదు. ముళీ 85, కోహ్లీ 76 పరుగులతో చెలరేగిపోవడంతో టీమిండియా 59 .2 ఓవర్లలోనే 200 పరుగుల స్కోరును దాటేసింది. దాంతో మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతోంది. టీ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విజయానికి 159 పరుగుల దూరంలో నిలిచింది. -
నిబంధనలకు పాతర..ఇసుక జాతర
పెదపులిపాక క్వారీలోకి ప్రవేశిస్తున్న భారీ లారీలు ప్రభుత్వ జీవో 95కు తూట్లు చోద్యం చూస్నున్న అధికారులు స్టాక్పాయింటే లేదు... ర్యాంపు నిరుపయోగం పెదపులిపాక(పెనమలూరు) : తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం,అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెదపులిపాకలో ప్రభుత్వ నిబంధనల అమలుకు నోచుకోవడం లేదు. .ఇసుక క్వారీల్లోకి 3 క్యూబిక్ మీటర్లకు మించి లోడ్ ఉన్న వాహనాలను అనుమతించరాదని ప్రభుత్వ జీవో 95లో స్పష్టంగా ఉన్నా.... అధికారులు భారీ వాహనాలను అనుమతిస్తూనే ఉన్నారు. అలాగే ఇసుక లోతుగా తవ్వుతుండడంతో నదిలో పర్యావరణానికి, భూగర్భజలాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఇసుకకు డిమాండ్ బాగా పెరగడంతో పెదపులిపాక ఇసుక క్వారీని ఇటీవలే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించింది. అయితే ఈ క్వారీ ప్రారంభించిన ప్పటి నుంచి అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. పెద్ద వాహనాల ద్వారా ఇసుక తరలించాలంటే ఇసుక క్వారీ బయట స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గరిష్టంగా ఆరు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక తరలించడానికి పర్మిట్లు ఇచ్చి అనుమతించాలి. క్వారీలో ఏం జరుగుతోందంటే... పెదపులిపాక ఇసుక క్వారీలో నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక్కడ తెలుగు తమ్ముళ్ల హడావిడి విపరీతంగా ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణం, భూగర్భ జలాలు, జీవోలోని నిబంధనలు పట్టించుకోకుండా అడ్డగోలుగా ఇసుక క్వారీయింగ్ చేస్నున్నారు. ప్రతి రోజు వంద లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలు కూడా నదీ ప్రవాహానికంటే లోతుగా జరుగుతున్నాయి. క్వారీకి అతి సమీపంలో 10 ఎంజీడీ తాగునీరు సంప్ కూడా ఉంది. దానిని సైతం పట్టించుకోకుండా క్వారియింగ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్టాక్ పాయింట్ ఏదీ..? ఈ క్వారీకి స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలని గతంలో పరిశీలిలనకు వచ్చిన కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే భారీ వాహనాలు నదిలోకి వెళ్లకుండా స్టాక్‌పాయింట్ వద్ద నుంచి మాత్రమే ఇసుక తరలించాల్సి ఉంది. అయితే తమ్ముళ్ల ఒత్తిడి మేరకు స్టాక్‌పాయింట్ పెట్టకుండా లారీలను నేరుగా నదిలోకి తీసుకు వెళుతున్నారు.దీంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడమే కాకుండా... లారీల కోసం పనికిరాని ర్యాంప్ నిర్మాణం చేసి నిధులు మట్టిపాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా... ఈ విషయమై సెర్ఫ్ కో-ఆర్డినేటర్ మరియబాబును వివరణ కోరగా క్వారీలోకి భారీ వాహనాలు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు. -
విజేతగా నిలిచి... వీరంగం సృష్టించి...
చైనా టీటీ ప్రపంచ చాంపియన్ జాంగ్ జైక్ అత్యుత్సాహం బీజింగ్: మితిమీరితే ఏదైనా అనర్థదాయకమే. చైనాకు చెందిన ప్రపంచ, ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్ జాంగ్ జైక్ విషయంలో ఇది రుజువైంది. జర్మనీలోని డసెల్డార్ఫ్ పట్టణంలో ఆదివారం ముగిసిన పురుషుల ప్రపంచ కప్ ఫైనల్లో తన దేశానికే చెందిన మా లాంగ్‌పై 8-11, 11-4, 13-11, 7-11, 2-11, 11-5, 12-10తో జాంగ్ జైక్ గెలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నెగ్గడంతో జాంగ్ జైక్ సంబరాలకు అంతే లేకుండా పోయింది. అత్యుత్సాహంతో కోర్టు పక్కనే ఉన్న వాణిజ్య ప్రకటనల హోర్డింగ్‌లను బద్దలు కొట్టాడు. ఆ వెంటనే తన కోర్టుకు ఎదురుగా ఉన్న ఇతర హోర్డింగ్‌లనూ బద్దలు కొట్టాడు. తన షర్ట్‌ను విప్పేసి ప్రేక్షకులపైకి విసిరేశాడు. జాంగ్ జైక్ నిర్వాకంపై అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విజేత హోదాలో అతనికి రావాల్సిన ప్రైజ్‌మనీ 45 వేల డాలర్లను (రూ.27 లక్షల 55 వేలు) నిలిపివేసింది. తర్వాత జైక్ తన ప్రవర్తనపట్ల క్షమాపణలు కోరాడు.