
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
ఎస్పీ.. ‘‘జయహో జగదీష్‌రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment