ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు
కుంకలగుంట (నకరికల్లు): జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు కుంకలగుంటలో ఘనంగా నిర్వహించారు. కుంకలగుంట పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు జరిగిన పోటీలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట), గోళ్లపాడు ముప్పాళ్ల, వాగ్దేవి గోల్డెన్‌బాయ్స్ (నరసరావుపేట) జట్లు విజేతలుగా నిలిచి లీగ్‌మ్యాచ్‌లలో ప్రవేసించాయి. రెండురోజు ఫైనల్ పోటీలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.