ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు ర్యాలీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు శాంతిర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో నివసిస్తున్న తెలుగువారు శాంతిర్యాలీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాషింగ్టన్ డీసీ నగరంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ రీజనల్ కొ- ఆర్డినేటర్ సురేంద్రతోపాటు రమేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. డల్లాస్లోని థామస్ జఫర్సన్ పార్కులో నిర్వహించిన ప్రదర్శనలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతోపాటు వివిధ విశ్వవిధ్యాలయాల విద్యార్థులూ పాల్గొని జగన్కు మద్దతు ప్రకటించారు. యూఎస్ వైసీపీ విభాగం కో-కన్వినర్ గురువారెడ్డి ర్యాలీలకు మద్దతు తెలిపారు.