కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకారం
ఒట్టావా: కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే, వారు మొత్తంగా సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించడం లేదని చెప్పారు. కెనడాలో ఓట్టావాలోని పార్లమెంట్ హాల్‌లో తాజాగా దీపావళి వేడుకల్లో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు.
అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారులు, అభిమానులు సైతం ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని, అయితే వారంతా హిందూ కెనడా పౌరులకు ప్రాతినిధ్యం వహించడం లేదని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారిందని, అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ పలుమార్లు ఆరోపించింది. అయినా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించని సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment