ప్లేటు ఫిరాయించిన త్రిష | Actor Trisha Krishnan targeted by Jallikattu supporters for supporting | Sakshi
Sakshi News home page

ప్లేటు ఫిరాయించిన త్రిష

Published Mon, Jan 16 2017 3:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

ప్లేటు ఫిరాయించిన త్రిష - Sakshi

ప్లేటు ఫిరాయించిన త్రిష

నటి త్రిష ప్లేటు పిరాయించారా? ఆమె ప్రవర్తన చూసిన వారి నుంచి ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడిపై జల్లికట్టు మద్దతుదారులు మండిపడుతున్నారు.

నటి త్రిష ప్లేటు పిరాయించారా? ఆమె ప్రవర్తన చూసిన వారి నుంచి  ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడిపై జల్లికట్టు మద్దతుదారులు మండిపడుతున్నారు. మూగజీవుల సంరక్షణ సంస్థ పెటాకు నటి త్రిష ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా జల్లికట్టు క్రీడ నిషేధానికి పెటా నిర్వాహకులే కారణం. వారి పిటిషన్‌ కారణంగానే సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. దీంతో జల్లికట్టుకు నటి త్రిష వ్యతిరేకం అనే ప్రచారం జనాల్లో బాగా నాటుకుపోయింది. ప్రస్తుతం జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటమే జరుగుతోంది. కోర్టులు, ప్రభుత్వాల నిర్ణయం ఏమైనా తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టును జరిపే తీరుతామని ప్రజలు ధృడ నిశ్చయంతో ఉండటమే గాకుండా మదురై తదితర గ్రామాల్లో జల్లికట్టును నిర్వహించారు. ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించిందన్నది వేరే విషయం.

 కాగా నటి త్రిష నటిస్తున్న గర్జన చిత్ర షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన జల్లికట్టు మద్దతుదారులు ఆమెపై దాడికి పాల్పడ్డారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్‌ చేసి త్రిషను సురక్షితంగా అక్కడి నుంచి పంపివేశారు. కాగా కోవై లాంటి ప్రాంతాల్లో త్రిష నటించిన చిత్రాల విడుదలను అడ్డుకుంటామని జల్లికట్టు మద్దతుదారులు అంటున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో నటి త్రిష మరణించినట్లు పోస్టర్లు ముద్రించడం, ఆమెకు నివాళులర్పించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడం కలకలం రేకెత్తించింది. ఇలాంటి చర్యలకు తన ట్విట్టర్‌లో స్పంధించిన త్రిష స్త్రీలను గౌరవించే సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో త్రిషకు మద్దతుగా పలువురు నటీనటులు గళం విప్పడం విశేషం. వారిలో నటుడు కమలహాసన్, నటి రాధికాశరత్‌కుమార్‌ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారన్నది గమనార్హం.

కాగా కమలహాసన్‌ త్రిషను సమర్థించే విధంగా ఆమెకు మనకు ఉన్న వ్యత్యాసాన్ని ఊరు గుర్తెరుగుతుంది. సిద్దాంతం వర్థిల్లేలా. జల్లికట్టు ఎద్దులు వర్థిల్లేలా పాటుపడదాం. ఉద్వేగాలను పక్కన పెట్టి ప్రేమను పంచుకుందాం అని వ్యాఖ్యానించారు. కాగా భయపడిందో ఏమో గానీ త్రిష పలాయనం చిత్తగించారు. ఈ బ్యూటీ తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని, తానెప్పుడూ జల్లికట్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని ప్లేటు ఫిరాయించారు. తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని అన్నారు. అయితే ఈ అమ్మడు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా జల్లికట్టు మద్దతుదారులు ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు. త్రిష నిజంగా జల్లికట్టుకు వ్యతిరేకం కాకుంటే వెంటనే తను పెటాను వదిలి బయటకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా నటి కుష్బూ కూడా పెటాకు వ్యతిరేకంగా స్పందించి ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement