
ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే వాటిలో ముందుండేది సినిమా ఇండస్ట్రీనే. అలా కోలీవుడ్‌లో సినిమాకు అవసరమైన అన్ని విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటూ ఎదుగుతున్న నటి శాంతి బాలచంద్రన్. ఈమె సమీపకాలంలో నటించిన వెబ్ సిరీస్ స్వీట్ కారం కాఫీ. అమెజాన్ ప్రైమ్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇందులో నివీ పాత్రకు ప్రేక్షకులు, విమర్శల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
(ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు)
ఇకపోతే అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు పంపబడ్డ జల్లికట్టు చిత్రంలో సోఫియా పాత్రలో నటించిన శాంతి బాలచంద్రన్ నటన ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలా వైవిధ్యమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో. నటిస్తూ సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఈమె నటనతో పాటు రచనా, నాటక రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఒబ్లివిన్ అనే సంగీత ఆల్బమ్ ద్వారా గీత రచయితగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఏఆర్ రెహామాన్ విడుదల చేసిన ఈ సంగీత ఆల్బమ్ కు మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం ఒక చిత్రానికి సహ దర్శకురాలిగా పని చేస్తున్నారు. అదే విధంగా నటిగా పలు చిత్రాలు చేతిలో ఉన్నాయని, వాటిగురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని నటి శాంతి బాలచంద్రన్ పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించనున్నట్లు ఈమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment