బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment