టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడ ఎంపీటీసీ ప్రాదేశికానికి వైఎస్సార్‌సీపీ తరపున బల్లి కామరాజు నామినేషన్ వేశారు. ఆయనను అదే గ్రామానికి చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ బలపరిచారు. ఆ స్థానంలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ భార్య లలితకుమారి పోటీ చేస్తున్నారు. నియంత పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నిమ్మాడలో ఓ సాధారణ మహిళ తనకు ఎదురు తిరగడం ఏమిటని కింజరాపు కుటుంబ సభ్యులు తమ అనుచరుడు కింజరాపు కృష్ణతోపాటు మరికొంత మంది కార్యకర్తలతో బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతుగా బలపరుస్తూ వేసిన నామినేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని బమ్మిడి లక్ష్మి ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీని ఆశ్రయించడంతో, కోటబొమ్మాళి ఎస్‌ఐ లక్ష్మణరావు నిమ్మాడ గ్రామానికి చేరుకుని బమ్మిడి లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మాడ గ్రామంలో టీడీపీ నాయకులను నిలువరించకపోతే పెద్ద ఎత్తున రిగ్గింగ్‌లు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నియంత పాలనకు అడ్డా..
నిమ్మాడ పేరు చెప్పగానే అది కింజరాపు కుటుంబ సభ్యుల నియంత పాలనకు అడ్డా అంటూ ప్రజలంతా భయాందోళన చెందుతుంటారు. ఇక్కడ కింజరాపు కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం... చేసిందే న్యాయం... అటువంటి నిమ్మాడ గ్రామంలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరకూడదన్నది వారి అభిమతం. అటువంటి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక విప్లవానికి ఓ సాధారణ మహిళ నాంది పలికింది. వైఎస్సార్ సీపీ తరపున ఎంపీటీసీ బరిలోకి దిగిన వ్యక్తికి మద్దతుగా నామి నేషన్‌ను బలపరించింది. ఇదే కింజరాపు అనుచరుల అక్కసుకు కారణమైంది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతు పలికిన బమ్మిడి లక్ష్మి పై బెదిరింపులకు పాల్పడ్డారు...తమకు తెలియకుండా వైఎస్సార్ అభ్యర్థికి మద్దతు పలుకుతావా...మమ్మల్ని ఎదురిస్తే పరిస్థితు లు మరోలా ఉంటాయ్ అంటూ కింజరాపు హరిప్రసాద్, వారి అనుచరులు కింజరాపు కృష్ణ, అచ్చెన్నాయుడు, అన్నెపు రాధాకృష్ణ తదితరులు బెదిరించినట్లు బాధితురాలు లక్ష్మి వైఎస్సార్ సీపీకి చెందిన కోటబొమ్మాళి నాయకుల వద్దవాపోయింది.
తమకు ఆసరాగా ఉ న్న జీడిచెట్లను సైతం ధ్వంసం చేస్తామంటూ బెదిరించినట్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోట»ొమ్మాళి వైఎస్సార్ సీపీ నాయకులంతా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో కోట»ొమ్మాళి ఎస్‌ఐ లక్ష్మణరావు నిమ్మాడ గ్రామానికి చేరు కుని బాధితురాలు లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ప్రతి ఎన్నికల్లో నిమ్మాడ గ్రామంలో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరుగుతాయనడానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ సారి పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, గత సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment