టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయులు మంగళవారం ఘర్షణ పడ్డారు.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం లభించడంతో ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కొన్ని పార్టీలు ఖాలీ అవుతుండగా.. మరికొన్ని పార్టీల్లో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో టిక్కెట్ల గోల మొదలైంది.
టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయులు మంగళవారం ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్ తమ లీడర్కే కేటాయించాలంటూ ఇరు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. జాఫర్గఢ్ మండలం చీగారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.