'సిగ్గుంటే తీర్మానం చేయించు' | kadiam srihari srihari challenges to revanth on sc classification issue | Sakshi
Sakshi News home page

'సిగ్గుంటే తీర్మానం చేయించు'

Published Thu, Nov 19 2015 12:49 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

kadiam srihari srihari challenges to revanth on sc classification issue

వరంగల్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత వేడిని పెంచుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో టీఆర్ఎస్ దూకుడే మంత్రంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు.

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తీర్మానం చేయించాలని ఈ సందర్భంగా కడియం డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీలు మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాయని కడియం శ్రీహరి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement