కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకూ విజృంభిస్తుంది. ప్రతిరోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా, విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత దృష్ట్యా షూటింగ్‌లో పాల్గొనేందుకు సైతం సినీ నటులు ఇష్టపడటం లేదు. తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు సైతం తాను షూటింగ్‌కి రాలేనని చెప్పేశాడట.
ప్రస్తుతం ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే వైజాగ్ షెడ్యూల్‌లో జగపతిబాబు పాల్గొనాల్సి ఉండగా, ఆయన నో చెప్పినట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను షూటింగ్‌కు రాలేనని తేల్చి చెప్పారట జగపతిబాబు.
చదవండి : కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు
పరిస్థితి విషమిస్తోంది, నా వల్ల కాదు, వదిలేస్తున్నా..
Comments
Please login to add a commentAdd a comment