సాక్షి, చెన్నై: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లాభం’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ ఇటీవల ప్రారంభం కావడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ‘లాభం’ షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్ అర్థంతరంగా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో దీనిపై పలు రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ ట్విటర్ వేదికగా శ్రుతీ సోమవారం వివరణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కు పెద్ద ఎత్తున చుట్టూ పక్కల ప్రజలు తరలి వచ్చినందున తాను షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ‘దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు షూటింగ్ స్పాట్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మహమ్మారి కాలంలో అందరికి ప్రమాదమే. ప్రతి ఒక్కరూ ప్రాటోకాల్ పాటించాల్సిందే. ఒక మహిళగా, సినీ నటిగా కరోనా ప్రొటోకాల్ దృష్ట్యా పలు నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. అందుకే షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాను’ అంటూ శ్రుతీ వివరించారు. (చదవండి: వకీల్ సాబ్ సెట్‌లో అడుగుపెట్టనున్న శృతి)
కాగా ప్రస్తుతం ‘లాభం’ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. స్క్రిప్ట్‌లో భాగంగా ఈ క్రైమాక్స్ సీన్స్‌ను తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతంలో షూటింగ్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు విజయ్ సేతుపతిని, శ్రుతిహాసన్‌ను చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఇక ఇది ఊహించని చిత్ర యూనిట్ ముందుగా ఎలాంటి భద్రత చర్యలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ రద్దీ పెరగడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా లాభం చిత్రంలో జగపతిబాబు, కలైరసన్, సాయి ధన్షిక, రమేష్ తిలక్, పృథ్వీ, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అభించింది. ఇక సినిమా విడుదల తేదీని కూడా దర్శక నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్)
COVID is a serious health risk everyone ! The pandemic is not over ! I as a person and an actor have the right to prioritise my safety and health if protocols are not followed ! Just saying
— shruti haasan (@shrutihaasan) November 19, 2020
Comments
Please login to add a commentAdd a comment