
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. నిండు గర్భిణిని హాస్పిటల్‌లో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మినిచ్చింది. రైల్వే స్టేషన్ బాత్‌రూమ్‌లో జన్మించిన శిశువు సరైన వైద్యం అందక కొద్దిసేపటికి మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈత్ రైల్యే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైల్యే అధికారుల సమాచారం ప్రకారం.. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతు రైల్యే స్టేషన్‌కి వచ్చిందని, నొప్పులు ఎక్కువ్వడంతో స్టేషన్‌లోని బాత్‌రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చామని, కానీ అంబులెన్స్ వచ్చేలోపే శిశువు మరణించిందని రైల్యే అధికారులు తెలిపారు. గర్భిణిని హాస్పిటల్ సిబ్బంది ఎందుకు తిరస్కరించారో కారణం మాత్రం తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment