bothroom
-
బాత్రూమ్లో జననం.. కొద్దిసేపటికే మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో బాత్రూమ్లో బిడ్డకు జన్మినిచ్చింది. రైల్వే స్టేషన్ బాత్రూమ్లో జన్మించిన శిశువు సరైన వైద్యం అందక కొద్దిసేపటికి మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈత్ రైల్యే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్యే అధికారుల సమాచారం ప్రకారం.. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతు రైల్యే స్టేషన్‌కి వచ్చిందని, నొప్పులు ఎక్కువ్వడంతో స్టేషన్‌లోని బాత్రూమ్లో శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చామని, కానీ అంబులెన్స్ వచ్చేలోపే శిశువు మరణించిందని రైల్యే అధికారులు తెలిపారు. గర్భిణిని హాస్పిటల్ సిబ్బంది ఎందుకు తిరస్కరించారో కారణం మాత్రం తెలియలేదు. -
‘అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తుంది’
అమరావతి: ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తోందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. బీజేఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, బీజేపీకి మరీ ఇంత చిన్న రూమా అంటూ ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ రూమ్ చూస్తే తనది చేతగానితనం అనే భావన...ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదన్నారు. బాత్రూమ్ లేదని మంత్రులను అడిగితే... తమదీ అదే పరిస్థితి అన్నారని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. ఆరుగురు మంత్రులకు ఒకే బాత్రూమ్ కేటాయించడం దారుణమన్నారు. స్కూళ్లు, కాలేజీలు కట్టినట్టలు అసెంబ్లీని కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. అద్దె కావాలన్నా చెల్లిస్తానని, బీజేఎల్పీ కార్యాలయం మార్చమని కోరతానని అన్నారు. ఆ మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనకే బాధనిపిస్తోందని, అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. కాగా గతంలో పలువురు మంత్రులు కూడా తమ ఛాంబర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
బంగారం బాత్రూంలో పడేశాడు
హైదరాబాద్ : అధికారుల నిఘాను పసిగట్టిన ఓ అక్రమార్కుడు మూడు కిలోల బంగారాన్ని బాత్రూంలో (టాయిలెట్) పడేశాడు. అతడి నుంచి అధికారులు మరో రెండు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనంప ప్రకారం... హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35) ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు బంగారం అక్రమంగా తీసుకొస్తున్నాడని డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు ముందస్తు సమాచారంతో అప్రమత్తం అయ్యారు. అధికారుల నిఘా పసిగట్టిన సదరు వ్యక్తి తన లగేజీలో ఉన్న మూడు కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టులోని బాత్రూంలోకి చొరబడి కుండీలో పడేశాడు. అధికారులు వెంటన అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు.