బంగారం బాత్రూంలో పడేశాడు | Man held with gold at shamshabad airport | Sakshi
Sakshi News home page

బంగారం బాత్రూంలో పడేశాడు

Published Thu, Sep 4 2014 9:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Man held with gold at shamshabad  airport

హైదరాబాద్ : అధికారుల నిఘాను పసిగట్టిన ఓ అక్రమార్కుడు మూడు కిలోల బంగారాన్ని బాత్రూంలో (టాయిలెట్) పడేశాడు. అతడి నుంచి అధికారులు మరో రెండు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనంప ప్రకారం... హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35)  ఒమన్ ఎయిర్లైన్స్ విమానంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

 

అతడు బంగారం అక్రమంగా తీసుకొస్తున్నాడని డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు ముందస్తు సమాచారంతో అప్రమత్తం అయ్యారు. అధికారుల నిఘా పసిగట్టిన సదరు వ్యక్తి తన లగేజీలో ఉన్న మూడు కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టులోని బాత్రూంలోకి చొరబడి కుండీలో పడేశాడు. అధికారులు వెంటన అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement