Nazeer
-
జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్ నిర్దోషులు
కొచ్చి: కోజికోడ్ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోజికోడ్ కేఎస్ఆర్టీసీ, మొఫుసిల్ బస్టాండ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి. 2011లో ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. నజీర్, షఫాస్ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్ దాఖలు చేసిన అప్పీలును కేరళ హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తుదితీర్పు వెల్లడించింది. ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
అర్ధరాత్రి నారాయణ హృదయాలయలో ఉద్రిక్తత
-
దొంగనోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖమ్మం: ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన నజీర్ అనే వ్యక్తి బస్టాండ్ సమీపంలో దొంగ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 25వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. -
22ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ అరెస్ట్
హైదరాబాద్ : బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న నజీర్ ...ఫజీయుద్దీన్ గ్యాంగ్‌లో సభ్యుడు. నజీర్పై అబిడ్స్, హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కర సేవకులు పాపయ్య గౌడ్, నందరాజు గౌడ్ దాడి కేసులో నజీర్ నిందితుడు. గతంలో బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు... అనంతరం దుబాయ్ పారిపోయాడు. 22 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నజీర్‌ను సిట్ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. -
22ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ అరెస్ట్
-
బంగారం బాత్రూంలో పడేశాడు
హైదరాబాద్ : అధికారుల నిఘాను పసిగట్టిన ఓ అక్రమార్కుడు మూడు కిలోల బంగారాన్ని బాత్రూంలో (టాయిలెట్) పడేశాడు. అతడి నుంచి అధికారులు మరో రెండు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనంప ప్రకారం... హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35) ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు బంగారం అక్రమంగా తీసుకొస్తున్నాడని డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు ముందస్తు సమాచారంతో అప్రమత్తం అయ్యారు. అధికారుల నిఘా పసిగట్టిన సదరు వ్యక్తి తన లగేజీలో ఉన్న మూడు కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టులోని బాత్రూంలోకి చొరబడి కుండీలో పడేశాడు. అధికారులు వెంటన అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు.