22ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ అరెస్ట్ | Man on the run for 22 years nabbed by CIC sleuths | Sakshi
Sakshi News home page

22ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నజీర్ అరెస్ట్

Published Thu, Jan 8 2015 10:19 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Man on the run for 22 years nabbed by CIC sleuths

హైదరాబాద్ : బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.  దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న నజీర్ ...ఫజీయుద్దీన్ గ్యాంగ్లో సభ్యుడు. నజీర్పై అబిడ్స్, హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కర సేవకులు పాపయ్య గౌడ్, నందరాజు గౌడ్ దాడి కేసులో నజీర్ నిందితుడు. గతంలో బెయిల్పై బయటకు వచ్చిన అతడు... అనంతరం దుబాయ్ పారిపోయాడు.   22 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నజీర్ను సిట్ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement