వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు | Doctor Shot Dead After Child He Allegedly 'Refused' To Treat Dies | Sakshi
Sakshi News home page

వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు

Published Sat, Apr 23 2016 11:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు

వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు

డెహ్రాడూన్: అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేయడానికి నిరాకరించిన డాక్టర్ ను ఓ వ్యక్తి కాల్చిచంపిన ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్ధవ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది.  సీనియర్ ఎస్పీ అనంత్ శంకర్ తక్ వాలే కథనం ప్రకారం.. నగరానికి చెందిన మానిక్ రాఠీ కుమారుడు (ఏడాదిన్నర  వయసు) అతిసార వ్యాధితో బాధపడుతున్నాడు.

మానిక్ రాఠీ తన కుమారుడిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యునిగా 
పని చేస్తున్న  ఎస్ కే సింగ్ ఇంటికి వెళ్లాడు. తన కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యం చేయమని కోరాడు. ఆ డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించడంతో  ఇతర వైద్యులను సంప్రదించాడు. అప్పటికే కొడుకు మృతిచెందడంతో మానిక్ రాఠీ ఆగ్రహించాడు. ఎస్ కే సింగ్ ను తుపాకీతో కాల్చి చంపాడు. గతంలో రాఠీపై ఆర డజను కేసులున్నాయని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని అనంత్ శంకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement