ఒక బస్సులో జరిగిన హైడ్రామా చూస్తే ఎవ్వరికైనా పొట్ట చెక్కలైపోవాల్సిందే. ఒక బస్సులో కూర్చోవడానికి ఎక్కడా సీటులేక ఏకంగా డ్రైవర్ సీటులోనే కూర్చుంది ఒక మహిళ. కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి లేవమన్నా లేవలేదు సరికదా కావాలంటే నువ్వే వెళ్లి ఎక్కడైనా కూర్చోమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆ మహిళతో పాటు ఆమె అత్తగారు కూడా వాదులాడటంతో వారిని ఒప్పించడం ఆ డ్రైవర్ వల్ల కాలేదు. చివరికి దౌర్జన్యం చేస్తే తప్ప డ్రైవరుకు తన సీటు దక్కలేదు.
ఇంకెక్కడైనా కూర్చో..
అర్జెంటు పనిమీద ఎదో ఊరికి ప్రయాణం కట్టిన అత్తాకోడళ్లు బస్ స్టాండ్లో ఉన్న ఒక బస్సు ఎక్కారు. అత్తాకోడళ్లలో అత్తకు వెనక ఎక్కడో ఒక సీటు దొరకడంతో వెళ్లి కూర్చుంది. కానీ కోడలు మాత్రం బస్సులో ఎక్కడా సీటు లేక ఖాళీగా ఉందని నేరుగా వెళ్లి డ్రైవర్ సీటులో కూర్చుంది. తీరా బసు డ్రైవర్ వచ్చి అది నా సీటు నేను బసు డ్రైవింగ్ చేయాలి.. వెళ్లి వేరే చోట కూర్చోమని అడిగితే.. ఆ మహిళ ఇది నీ సీటు కాదు నాది, కావాలంటే నువ్వే వెళ్లి వేరెక్కడైనా కూర్చుని బస్సు నడపమని సలహా ఇచ్చింది.
కోడలికి అత్త వత్తాసు..
కొద్దిసేపటికి వెనక ఉన్న అత్త కూడా కోడలితో కలిసి డ్రైవరుని దుర్భాషలాడారు. పాపం డ్రైవరుని ఒక్కడిని చేసి అత్తాకోడళ్లు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చుట్టూ చేరిన జనం కూడా డ్రైవరుకు ఎటువంటి సాయం చేయకపోవడం విదూరం. చివరికి సహనం నశించిన డ్రైవరు ఆమెని బలవంతంగా కిందకు లాగితే గాని తన సీటు తనకు దక్కలేదు. ఎక్కడ జరిగిందో తెలియదు గాని, ఉత్తర భారతదేశంలోనే ఎక్కడో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియోని ఎవరో ఫోన్లో తీసి సోషల మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పుడు వైరల్ కావడం విశేషం.
మొదట ఇదేదో ప్రాంక్ వీడియో అనుకున్న చాలామందికి కొద్దిసేపు అత్తాకోడళ్ల మాటతీరు చూశాక గాని అర్ధం కాదు ఇది సీరియస్ మ్యాటరేనని.. వారికి బస్సు ఎలా నడుస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని. టెక్నాలజీ సాయంతో రాకెట్ వేగంతో కాలం దూసుకుపోతున్న రోజుల్లో ఇలాంటి అమాయకులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
Indian travel diaries 😂😂😂 Lady and her bahu board a bus and bahu sits in the driver's seat. When the driver asks her to vacate the seat both ladies refuse and ask him to drive the bus from any other seat 😂😂😂
— Shirish Thorat (@shirishthorat) March 12, 2023
Only in India ! pic.twitter.com/NXScZnUlBG
ఇది కూడా చదవండి: భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్లో వెతికిన భార్య
Comments
Please login to add a commentAdd a comment