masids
-
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
ఘనంగా రమజాన్
ఈద్గాలు, మసీదుల వద్ద లక్షలాది మంది ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సాక్షి, హైదరాబాద్: నగరంలో రమజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీరాలం ఈద్గా, చార్మినార్ మక్కామసీదు, అంబర్పేట్, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో పలు మార్గాల్లో పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు.