ఘనంగా రమజాన్ | Ramazan celebrations has done grandly | Sakshi
Sakshi News home page

ఘనంగా రమజాన్

Published Sun, Jul 19 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

ఘనంగా రమజాన్

ఘనంగా రమజాన్

ఈద్గాలు, మసీదుల వద్ద  లక్షలాది మంది ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రమజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీరాలం ఈద్గా, చార్మినార్ మక్కామసీదు, అంబర్‌పేట్, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
 
 పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో పలు మార్గాల్లో పోలీసులు వాహనాలను  దారిమళ్లించారు. ప్రార్థనల అనంతరం  ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement