
చారిత్రక నగరి.. ఆధ్యాత్మిక ఝరి
నగరంలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. ఒకవైపు రంజాన్, మరోవైపు బోనాలు..
నగరంలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. ఒకవైపు రంజాన్, మరోవైపు బోనాలు.. శతాబ్దాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలు గురువారం భిన్న మతాల పండుగలను ఒకేసారి జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. లంగర్‌హౌస్ నుంచి కోట వరకు సాంస్కృతిక ప్రదర్శనలతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. జంట పండుగలు ‘హైదరాబాద్ ఆధ్యాత్మిక
వైభవాన్ని’ సమున్నతంగా ఆవిష్కరించాయి. - సాక్షి,సిటీబ్యూరో