
హైదరాబాద్: నగరంలో రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మికతకు నెలవు. అయితే రుచుల ప్రియులకు అది హలీమ్‌కు కొలువు. రద్దీ బజార్ల నుంచి సందు గొందుల దాకా తినుబండారాల స్టాల్స్ నుంచి లగ్జరీ ఫైన్‌డైనింగ్ రెస్టారెంట్ల వరకు, ఎందెందు వెదకినా.. అందందే హలీమ్ ఘుమఘమలు గుబాళిస్తూ ఉంటాయి. నగరవాసులకు మాత్రమే కాదు విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే సిటీ హలీమ్‌ను అందించడంలో స్పెషల్‌గా నిలవాలని తయారీదారులు పోటీపడుతుంటారు. కొందరు తమ సంప్రదాయ తయారీ పద్ధతులకు కట్టుబడి ఉంటారు, మరికొందరు సమకాలీన రుచులతో ప్రయోగాలు చేస్తారు. పలువురు ఫుడ్ లవర్స్‌ను ఫ్యాన్స్‌గా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆదరణ పొందిన టాప్ 10 హలీమ్ స్పాట్స్ విశేషాలివి..
భలే ‘సర్వీ’స్..
ప్రముఖ రెస్టారెంట్.. సర్వి గత కొంతకాలంగా అత్యంత ఆదరణ పొందుతున్న హలీమ్‌కు కేరాఫ్‌గా ఉంది. ఈసారి చికెన్ 65, ఉడికించిన గుడ్డు, జీడిపప్పు, క్రీమ్‌లతో కూడిన ప్రత్యేక ఇరానీ హలీమ్‌ను అందిస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్‌లలో సర్వి రెస్టారెంట్స్ ఉన్నాయి.
‘వజ్రం’లా..
హోటల్ సిటీ డైమండ్ హలీమ్ ప్రియుల ఫేవరెట్ ప్లేస్‌గా పేరొందింది. నెయ్యితో తయారైన వీరి హలీమ్ సుగంధ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దీనిని సంప్రదాయ భట్టిలో వండుతారు.
మెహదీపట్నంలో సిటీ డైమండ్ ఉంది.
హుషార్.. పెషావర్..
ప్రత్యేక టాపింగ్స్ లేని హలీమ్‌ను ఇష్టపడే వ్యక్తులకు, పెషావర్ సరైన ప్లేస్. గత కొన్ని సంవత్సరాలుగా సువాసన గల హలీమ్‌తో హైదరాబాదీలను ఆకట్టుకుంటోన్న పెషావర్ లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో ఉంది.
వహ్వా.. అని‘పిస్తా’..
నగరవాసులు అత్యంత ఇష్టపడే పిస్తా హౌస్ ప్రస్తావన లేకుండా హైదరాబాద్ హలీమ్ పండుగ ఉండదు. ప్రతి ఏటా మాంసం, మసాలాతో కూడిన హలీమ్‌తో తనదైన రుచిని పిస్తా హౌస్ అందిస్తుంది. నగరంలో దాదాపు ప్రతీ ప్రధాన ఏరియాలో పిస్తా హౌస్‌లు ఉన్నాయి.
మది దోచే.. మందార్
అచ్చమైన సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వండే హలీమ్‌కు మందార్ పేరొందింది, కాసింత ఇంటిశైలి రుచిని ఇష్టపడేవారికి కరెక్ట్ ప్లేస్. ఈ హలీమ్‌ను రుచి చూడాలంటే టోలీచౌకిలోని మందార్‌ను సందర్శించాల్సిందే.
ట్రిపుల్ ‘ఫై’న్..
ఫ్యూజన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది కేఫ్ 555.. చికెన్ 65, నల్లి ఘోష్‌్ట, తలవా ఘోష్‌్ట, ఉడికించిన గుడ్డు లేదా క్రీమ్ వంటి విభిన్న టాపింగ్స్‌తో వెరైటీ రుచులను అందిస్తుంది మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న ఈ కేఫ్.
సుభాన్.. మహాన్..
ఉస్మానియా బిస్కెట్‌ల సృష్టికర్త సుభాన్ బేకరీ రెండేళ్ల క్రితం హలీమ్ వ్యాపారంలో అడుగు పెట్టింది. స్వల్పకాలంలోనే నగరవాసుల
మనసులను గెలుచుకుంది. నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాలలో ఈ బేకరీ ఉంది.
గ్రిల్.. భారీ థ్రిల్..
బాహుబలి హలీమ్‌తో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది గ్రిల్(3 ప్లేట్ల హలీమ్, ఉడికించిన గుడ్లు, చికెన్ 65, పత్తర్ కా ఘోష్ట్, నల్లి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం క్రీమ్)తో కూడిన హలీమ్‌లను వడ్డిస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ హలీమ్ టేస్ట్ చేయాలంటే ఛలో సికింద్రాబాద్.
మటన్‌కా..
బాద్‘షా’
షాగౌస్ పేరు తెలియని మాంసాహార ప్రియులు సిటీలో ఉండరేమో. ఆ క్రమంలోనే హలీమ్ లవర్స్‌నూ తనదైన శైలితో ఆకట్టుకుంటోంది. వినియోగించే మాంసపు రుచి పరంగా ఫ్యాన్స్‌ను దక్కించుకున్న ఈ రెస్టారెంట్ సిటీలోని లక్డికాపూల్, టోలిచౌకి, గచి్చ»ౌలి షాలీబండాల్లో
ఉంది.
ఆదాబ్.. షాదాబ్..
ఓల్డ్ సిటీ నడి»ొడ్డున ఉన్న షాదాబ్ హోటల్ ప్రతి రంజాన్‌కు హలీమ్ ఆదరణలో అగ్రగామిగా ఉంటుంది. నాణ్యమైన ముడిదినుసులు సాంప్రదాయ వంట శైలిని ఉపయోగించడం వీరి ప్రత్యేకత. ఘాన్సీ బజార్‌లో షాదాబ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment