ఫుడ్ బిజినెస్‌లోకి ఇండియన్ క్రికెటర్
ఆకట్టుకుంటున్న వింటేజ్ రెస్ట్రో బార్
అధునాతన జీవనశైలికి అనుగుణంగా
ఫేజ్ త్రీ పీపుల్ చూపును
ఆకర్షిస్తున్న యాంబియన్స్
సెలబ్ స్పాట్‌గా వన్ 8 కమ్యూన్
సాక్షి, సిటీబ్యూరో: సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు.. కానీ వారి వ్యాపారాలకు హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకోవడం ఈ మధ్య విరివిగా జరుగుతోంది. నగరంలో బాలీవుడ్ హీరోలు మొదలు మనీష్ మల్హోత్రా వంటి ఫ్యాషన్ ఐకాన్స్ నుంచి ప్రముఖ భారతీయ క్రీడాకారుల వరకూ సొంత వ్యాపారాలను ప్రారంభించిన వారే. విభిన్న సంస్కృతులతో పాటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసేలా నగర జీవనం కొనసాగించడం ఒక కారణం. ఐతే నగరంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం సొంతంగా వన్–8 కమ్యూన్ అనే సరికొత్త రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్ వంటి పసందైన వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తున్నాయి.
విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్‌తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటి వినూత్న అనుభూతిని అందించటం వన్–8 కమ్యూన్ ప్రత్యేకత.
రిచ్ ఫుడ్.. వింటేజ్ లుక్..
ఇటీవలే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నడి»ొడ్డున ప్రారంభించిన వన్–8 కమ్యూన్ నగరానికున్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్‌లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ నగరానికి చేరుకోవడంతో ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్‌లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది.
కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడే..
ఈ స్పాట్ రాయల్ లుక్ ఇంటీరియర్‌తో పాటు కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్‌డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. కోహ్లీ అభిమానులు ఈ వంటకాలను రుచి చూడటానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం విశేషం. స్థానికంగా ఆదరణ పొందుతున్న ఫుడ్ రెసిపీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న మోడ్రన్ రుచులును తయారు చేస్తున్నారు. అంతే కాకుండా మద్యాన్ని ఇష్టపడే వారికి టలిస్కర్, గ్లెన్‌లివెట్, గ్లెన్ మెరంగే, గ్లెన్ ఫిడిచ్, క్రాగన్‌మోర్ వంటి విభిన్న టాప్ బ్రాండ్లు కొలువుదీరాయి. ఇవన్నీ దాదాపు పది–పన్నెండేళ్ల సరుకు కావడం విశేషం.
సెలబ్ స్పాట్...
హైటెక్ సిటీ వేదికగా కొలువుదీరిన ఈ రెస్టారెంట్ నగరంలోని సెలబ్రిటీలకు మంచి స్పాట్‌గా మారింది. దీని ప్రారం¿ోత్సవాలు ముగియకముందే మంచు మనోజ్ వంటి సినీతారల పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం మరింత ఆసక్తి పెంచింది. వన్–8 కమ్యూన్‌ను ఇప్పటికే సినీ ప్రముఖులు మంచు లక్షి్మ, నాని, అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జ, సు«దీర్ బాబు, సందీప్ కిషన్, ఆకాష్ పూరి, అభిరామ్ వంటి టాలీవుడ్ నటులు సందర్శించారు.
సామాజిక, సాంస్కృతిక అనుసంధాన వేదిక..
ఎల్లప్పుడూ ఆహారంతో పాటుగా సామాజికంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చే స్థలాన్ని సృష్టించడం వన్–8 కమ్యూన్ ప్రధాన లక్ష్యం. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులను ఆహారంతో అనుసంధానం చేసే కేంద్రంగా వన్–8 నిలుస్తుంది. స్థానిక ఫుడ్‌తో పాటు కాంటినెంటల్ ఫుడ్‌ను సైతం హైదరాబాద్ నగరం ఆహా్వనించింది, ఆస్వాదిస్తోంది. ఈ ఆదరణకు మెచ్చే విరాట్ కోహ్లీ ఈ రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ నగరం, ప్రజలు సరికొత్త రుచులను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. – వర్తిక్ తిహారా, వన్–8 కమ్యూన్ కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment