మసీదుల తొలగింపుపై ముస్లింల మౌన దీక్ష
దేవాలయాల తొలగింపులో భాగంగా ధ్వంసం చేసిన మసీదులను ప్రార్థన స్థలాలను తిరిగి నిర్మించాలని కోరుతూ మస్లింలు మౌన దీక్ష చేపట్టారు. ప్రార్థనా స్థలాలను, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వులను పాటించాలనే డిమాండ్‌తో నగరంలోని తారా మసీదువద్ద శుక్రవారం సామూహిక ప్రార్థనల అనంతరం మౌన దీక్షకు దిగారు.