వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్‌ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు.
హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్‌ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్‌ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్‌ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్‌కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు.
ఐరాసతోనూ చర్చిస్తున్నాం
‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్‌లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment