loudspeakers
-
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ?
పిఠాపురం(కాకినాడ జిల్లా): ఆ పొలంలోకి వెళితే ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. అలా రా.. అలా రా...! అంటూ మనిషి కేకలు వినిపిస్తుంటాయి. అలాగని ఎంత వెతికినా ఒక్క మనిషీ కనిపించడు. తీరా చూస్తే అక్కడ ఒక కర్రకు కట్టిన లౌడ్ స్పీకర్ నుంచి ఆ కేకలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఏంటా? అని అనుకుంటున్నారా! కోతుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వేసిన కొత్త ఎత్తు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఒక రైతు తన మొక్క జొన్న పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్. (అంతర చిత్రం) అరుపులకు భయపడి పొలానికి దూరంగా ఉన్న షెడ్ పైనే ఉండి పోయిన కోతులు ఇప్పటి వరకు రేకు డబ్బాలు, ఫ్యాన్లు వంటివి ఉపయోగించే రైతులు ప్రస్తుతం బ్యాటరీతో పని చేసే లౌడ్ స్పీకర్లను వాడుతూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా! అంటున్నారు. తాను పొలంలో ఉన్నంత సేపు చార్జింగ్ పెట్టి తాను ఇంటికి వెళ్లేటప్పుడు ఆన్ చేసి వదిలేస్తే మళ్లీ తాను తిరిగొచ్చే వరకు ఇది అరుస్తూ తన పంటను కాపాడుతోందంటున్నాడు రైతు. చదవండి: యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ.. -
మహారాష్ట్ర సీఎం షిండేకు షాక్.. నిబంధనల ఉల్లంఘనపై కేసు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాత్ షిండేపై కేసు నమోదైంది. ఔరంగాబాద్ పర్యటనలో భాగంగా రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్ ఉపయోగించారని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించారని జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. గత శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఔరంగాబాద్‌లో పర్యటించారు షిండే. రాత్రిళ్లలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వినియోగించారు. చికల్థానాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ముఖ్యమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాంతి చౌక్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య మైక్రోఫోన్లో మాట్లాడి సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు.. నిబంధనలు ఉల్లంఘించారంటూ అసెంబ్లీలో విపక్ష నేత అజిత్ పవార్ సైతం ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీస్ కమిషనర్, ఎస్పీలు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఏం జరిగిందో తెలుసు.. నేను మొదలుపెడితే భూప్రకంపనలే.. సీఎం షిండే వార్నింగ్ -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతుల వెరైటీ ఆలోచన
-
ఇక నుంచి లౌడ్స్పీకర్లు బంద్..!
చంఢీగర్ : అవసరం ఉన్నా.. లేకపోయినా.. అంతెత్తు లౌడ్‌స్పీకర్ల హోరుతో ప్రజల అనారోగ్యానికి కారణమయ్యేవారికి ఇక మూడినట్లే..! బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిషేదిస్తూ పంజాబ్-హరియాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు కూడా లౌడ్స్పీకర్లను వాడాలంటే రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆద్యాత్మిక కేంద్రాల్లో కూడా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లు పెట్టరాదని వెల్లడించింది. ఏడాది మొత్తంలో పండుగల సమయంలో 15 రోజులు లౌడ్‌స్పీకర్ల వాడకానికి వెసులుబాటు కల్పించింది. పండుగల సమయంలో రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వాడుకోవచ్చని తెలిపింది. జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హరీందర్ సింగ్ సిద్ధూ ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా... శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
ప్రచారం కాదు.. పరీక్షలే ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో నివాస ప్రాంతాల సమీపంలో మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీల కంటే పరీక్షలు ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నివాస ప్రాంతాల్లో మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై బెంగాల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన పరీక్షలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఇది విద్యార్థులు పరీక్షలు రాసే సమయమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అన్నారు. కాగా, పరీక్షలు ముఖ్యమేనని.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాము (రాజకీయ పార్టీలు) ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం తోసిపుచ్చలేనిదని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసే మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై నిషేధం ఎత్తివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించకూడదు’
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మసీదుల్లో, ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ కూడా సోనూ నిగమ్‌కు మద్దతు పలికారు. నివాసప్రాంతాల్లోని మసీదుల్లో, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఆయన తేల్చిచెప్పారు. ‘ఆన్ రికార్డు చెప్తున్నా.. సోనూ నిగమ్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నివాస ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు’ అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనూ నిగమ్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాజాగా ముంబై పోలీసులు సోనూ నిగమ్‌కు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు. -
లౌడ్ స్పీకర్లను కట్టడి చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆజా సమయాల్లో మసీదుల్లోని మైకుల నుంచి వచ్చే ధ్వని తీవ్రత స్థాయిలను గుర్తించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం ఆదేశించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల నుంచి పరిమితికి మించి శబ్దాలు వస్తుంటే.. తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఎస్.కుమార్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ పొల్యూషనల్ కంట్రోల్ బోర్డును ఆదేశించారు. పరిమితులకు లోబడి మాత్రమే లౌడ్ స్పీకర్లు వాడుతున్నట్లు 10 మసీదులు మాత్రమే స్పష్టం చేశాయని చెప్పారు. ధ్వనికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిన మసీదులు మినహా మిగిలిన అన్ని మసీదులను తనిఖీ చేయాలని డీపీసీసీని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా అధికంగా ధ్వని వస్తున్నట్లు తేలితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
సోను నిగమ్‌కు నాడు గూండాయిజం గుర్తురాలేదా?
న్యూఢిల్లీ: మసీదుల్లో, మందిరాల్లో మైకులు పెట్టి ప్రార్థనలు వినిపించడం గుండాయిజమే అంటూ ప్రముఖ పాప్ గాయకుడు సోను నిగమ్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకంటే ముందే స్పందించిన ముంబై హైకోర్టు మసీదుల్లో మైకులను ఎప్పుడో నిషేధించింది. అయినా కోర్టు ఉత్తర్వులు సరిగ్గా అమలు కావడం లేదు. అది వేరే విషయం. ‘మసీదులపై నిలబడి ముల్లాలు ఎందుకు అంత గట్టిగా పిలవాలి అల్లా ఏమీ చెవిటివాడు కాదుకదా!’ అని 15వ శతాబ్దానికి చెందిన బ్రజ్ (పాశ్చాత్య హిందీ కవి) కవి కబీర్ ఇంకా ముందే స్పందించారు. కబీర్ నుంచి సోనూ నిగమ్ వరకు ఎందరో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అయితే ప్రతిరోజు మసీదుల్లో, మందిరాల్లోనే వినిపించే ప్రార్థనలే గూండాయిజమా? వినాయకుని నిమజ్జనానికి, దుర్గా పూజకు, క్రిస్మస్ పండగకు మైకుల్లో అదరగొట్టే నినాదాలు, భక్తి గీతాలు, గుండెలు ఆగిపోయే రీతిలో డప్పులు మోగించడం, ఢిల్లీలో జరిగే జాగారణ రాత్రుల్లో తెల్లార్లు మైకుల్లో భజనలు, కీర్తనలు వినిపించడం గూండాయిజం కాదా? ఢిల్లీలో జరిగే జాగారణ కార్యక్రమాల్లో కూడా సోను నిగమ్ కూడా భక్తి గీతాలు ఆలపించారు. అప్పుడు ఆయనకు గూండాయిజం గుర్తురానట్లుంది. ఆధునిక భారతదేశంలో మత విశ్వాసకులు ఉన్నారు. ఛాందసవాదులున్నారు. హేతువాదులున్నారు. దేవుడిని నమ్మని నాస్తికులు ఉన్నారు. ఇందులో ఏ వర్గం వారు కూడా మరోవర్గంపై తమ అలవాట్లను, ఆచారాలను, సిద్ధాంతాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించకూడదు. అలా చేయడమంటేనే గూండాయిజం. ఈ లెక్కన దేశంలో గోవధను నిషేధించడం కూడా గూండాయిజమే. హిందువులు గోవులను పవిత్రంగా భావిస్తారని గోమాంసం తినే ముస్లింలపై నిషేధం విధించడమంటే ఏమిటీ? ఆధునిక భారత దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మతాల్లోనూ విశ్వాసాల్లోను మార్పు రావాలి. ఏ మతమైనా సర్వమానవ కల్యాణాన్ని కోరుకున్నప్పుడు ఒక వర్గం అభిప్రాయలను మరో వర్గంపై బలవంతంగా రుద్దడం అంటే గూండాయిజం కాదా? అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గ్రంధాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మైకులు లేవు. జనాన్ని పోగేసేందుకు గట్టిగా అరచి పిలిచే శక్తిగల యువకులను ప్రవక్త స్వయంగా నియమించారు. వారు మసీదులపైకి ఎక్కి సమావేశం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని సూచించడానికి గట్టిగా పిలిచేవారు. అలా పిలిచేవారే కాలక్రమంలో ముల్లాలయ్యారు. కాలక్రమంలో మైకులు రావడంతో వారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రార్థనా సమయాలు అందరికి తెలుసు. అందరి వద్ద గడియారాలున్నాయి. ఇప్పుడు కూడా మైకులు ఉపయోగించడం అవసరమా? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఏ దేవుడు కోరుకుంటారు? ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
డిఫాల్టర్లకు చెక్ పెట్టేందుకు సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మోసగాళ్లు, రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. డిఫాల్టర్ల నుంచి నిధులను రాబట్టేందుకు వీలుగా వారి ఇంటిముందు డప్పు వాయిద్యాలు, లౌడ్ స్పీకర్లతో పరువు తీసేందుకు సిద్దపడుతోంది. పెట్టుబడిదారుల డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైన వారి ఆస్తుల స్వాధీనం,అమ్మకం, వాటిని సమన్లు జారీ లాంటి సమయాల్లో ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ సేవలను అందించడానికి ఆసక్తిగల పార్టీల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎగవేతదారులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన సంస్థలు, వ్యక్తులనుంచి తిరిగి డబ్బులను రాబట్టేందుకు,ఆస్తుల ఎటాచె మెంట్‌కు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అనుమతనిచ్చిన సెబి తాజా మరో ఆలోచన చేస్తోంది. నోటీసులను / సమన్లు అందించడం, ఆస్తుల ఎటాచ్ మెంట్ , పబ్లిక్ నోటీసులు, సేల్ నోటీసులు తదితర వ్యవహారాలను థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నిర్వహించనుంది. ఈ మేరకు ఎన్‌బీఎఫ్‌సీఎస్ లేదా, ఇతర డిటెక్టివ్ సంస్థల్లో రిజిస్టర్ అయి గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రొఫెషనల్ ఏజెన్సీలను ఎన్నుకోనుంది. ఇలా ఎంపిక చేసిన ఏజెన్సీలు సెబీ అందించిన అడ్రసులో ఆదేశాలు, నోటీసులు, సమన్లు మరియు ఇతర కమ్యూనికేషన్స్ అంటించాలి. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అందుబాటులో ఉంటే వారికి వ్యక్తిగతంగాఈ నోటీసులు అందజేయబడతాయని సెబీ తెలిపింది. మరోపక్క ఈ సమాచారాన్ని ఏజెన్సీలు జప్తు అటాచ్మెంట్/ అమ్మకానికి సంబంధించిన వివరాలను డప్పు లు, లౌడ్ స్పీకర్ల బహిరంగ ప్రకటన ద్వారా చాటింపు వేయాలని తెలిపింది. ఈ క్రమంలో అవసరమైతే సహాయం చేయాల్సిందిగా రెవిన్యూ, స్థానిక అధికారులకు అవసరమైన ఆదేశాలు లేదా సూచనలను జారీ చేయబడతాయని తెలిపింది. ఈ మేరకు డ్రమ్మర్స్, లౌడ్ స్పీకర్ల సహా ఇతర సేవలను అందించే ఏజెన్సీ నుంచి ఆసక్తిని ఆహ్వానిస్తూ నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలో ఇతర నాలుగు ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సేవలు అందించాలని తెలిపింది.