
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాత్ షిండేపై కేసు నమోదైంది. ఔరంగాబాద్ పర్యటనలో భాగంగా రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్ ఉపయోగించారని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించారని జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. గత శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఔరంగాబాద్‌లో పర్యటించారు షిండే. రాత్రిళ్లలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు వినియోగించారు.
చికల్థానాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ముఖ్యమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాంతి చౌక్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య మైక్రోఫోన్‌లో మాట్లాడి సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు.. నిబంధనలు ఉల్లంఘించారంటూ అసెంబ్లీలో విపక్ష నేత అజిత్ పవార్ సైతం ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీస్ కమిషనర్, ఎస్పీలు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఏం జరిగిందో తెలుసు.. నేను మొదలుపెడితే భూప్రకంపనలే.. సీఎం షిండే వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment