డిఫాల్టర్లకు చెక్ పెట్టేందుకు సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మోసగాళ్లు, రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. డిఫాల్టర్ల నుంచి నిధులను రాబట్టేందుకు వీలుగా వారి ఇంటిముందు డప్పు వాయిద్యాలు, లౌడ్ స్పీకర్లతో పరువు తీసేందుకు సిద్దపడుతోంది. పెట్టుబడిదారుల డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైన వారి ఆస్తుల స్వాధీనం,అమ్మకం, వాటిని సమన్లు జారీ లాంటి సమయాల్లో ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ సేవలను అందించడానికి ఆసక్తిగల పార్టీల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఎగవేతదారులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన సంస్థలు, వ్యక్తులనుంచి తిరిగి డబ్బులను రాబట్టేందుకు,ఆస్తుల ఎటాచె మెంట్కు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అనుమతనిచ్చిన సెబి తాజా మరో ఆలోచన చేస్తోంది. నోటీసులను / సమన్లు అందించడం, ఆస్తుల ఎటాచ్ మెంట్ , పబ్లిక్ నోటీసులు, సేల్ నోటీసులు తదితర వ్యవహారాలను థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నిర్వహించనుంది. ఈ మేరకు ఎన్బీఎఫ్సీఎస్ లేదా, ఇతర డిటెక్టివ్ సంస్థల్లో రిజిస్టర్ అయి గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రొఫెషనల్ ఏజెన్సీలను ఎన్నుకోనుంది. ఇలా ఎంపిక చేసిన ఏజెన్సీలు సెబీ అందించిన అడ్రసులో ఆదేశాలు, నోటీసులు, సమన్లు మరియు ఇతర కమ్యూనికేషన్స్ అంటించాలి. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అందుబాటులో ఉంటే వారికి వ్యక్తిగతంగాఈ నోటీసులు అందజేయబడతాయని సెబీ తెలిపింది.
మరోపక్క ఈ సమాచారాన్ని ఏజెన్సీలు జప్తు అటాచ్మెంట్/ అమ్మకానికి సంబంధించిన వివరాలను డప్పు లు, లౌడ్ స్పీకర్ల బహిరంగ ప్రకటన ద్వారా చాటింపు వేయాలని తెలిపింది. ఈ క్రమంలో అవసరమైతే సహాయం చేయాల్సిందిగా రెవిన్యూ, స్థానిక అధికారులకు అవసరమైన ఆదేశాలు లేదా సూచనలను జారీ చేయబడతాయని తెలిపింది. ఈ మేరకు డ్రమ్మర్స్, లౌడ్ స్పీకర్ల సహా ఇతర సేవలను అందించే ఏజెన్సీ నుంచి ఆసక్తిని ఆహ్వానిస్తూ నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలో ఇతర నాలుగు ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సేవలు అందించాలని తెలిపింది.