రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ? | Loudspeakers For Crops To Protect Against Monkeys In Kakinada District | Sakshi
Sakshi News home page

రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ?

Published Wed, Aug 17 2022 6:33 PM | Last Updated on Wed, Aug 17 2022 6:33 PM

Loudspeakers For Crops To Protect Against Monkeys In Kakinada District - Sakshi

పిఠాపురం(కాకినాడ జిల్లా): ఆ పొలంలోకి వెళితే ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. అలా రా.. అలా రా...! అంటూ మనిషి కేకలు వినిపిస్తుంటాయి. అలాగని ఎంత వెతికినా ఒక్క మనిషీ కనిపించడు. తీరా చూస్తే అక్కడ ఒక కర్రకు కట్టిన లౌడ్‌ స్పీకర్‌ నుంచి ఆ కేకలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఏంటా? అని అనుకుంటున్నారా! కోతుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వేసిన కొత్త ఎత్తు.

గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఒక రైతు తన మొక్క జొన్న పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన లౌడ్‌ స్పీకర్‌. (అంతర చిత్రం) అరుపులకు భయపడి పొలానికి దూరంగా ఉన్న షెడ్‌ పైనే ఉండి పోయిన కోతులు  

ఇప్పటి వరకు రేకు డబ్బాలు, ఫ్యాన్లు వంటివి ఉపయోగించే రైతులు ప్రస్తుతం బ్యాటరీతో పని చేసే లౌడ్‌ స్పీకర్లను వాడుతూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా! అంటున్నారు. తాను పొలంలో ఉన్నంత సేపు చార్జింగ్‌ పెట్టి తాను ఇంటికి వెళ్లేటప్పుడు ఆన్‌ చేసి వదిలేస్తే మళ్లీ తాను తిరిగొచ్చే వరకు ఇది అరుస్తూ తన పంటను కాపాడుతోందంటున్నాడు రైతు.
చదవండి: యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ..  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement