మందుకు బానిసయ్యా.. లేకుంటే కథ వేరేలా ఉండేది! | Javed Akhtar on Marriage with Honey Irani: This is a Part of that Failed Relationship | Sakshi
Sakshi News home page

మొదటి భార్యకు విడాకులు.. ఈ తాగుబోతును పదేళ్లు భరించింది

Published Sun, Mar 17 2024 1:11 PM | Last Updated on Sun, Mar 17 2024 4:28 PM

Javed Akhtar on Marriage with Honey Irani: This is a Part of that Failed Relationship - Sakshi

మొదటి పదేళ్లు తను ఎలాగోలా భరించింది. కానీ తనకూ అనిపిస్తుంది కదా.. ఇలాంటి తాగుబోతు భర్తగా దొరికాడేంటి? అని! ఒకరోజు మందు మానేద్దామనుకున్నాను. అప్పటినుంచి మళ్లీ దాని జోలికే పో

ప్రముఖ కవి, వక్త, స్క్రీన్‌ ప్లే రచయిత జావెద్‌ అక్తర్‌.. తన మాజీ భార్య హనీ ఇరానీ ఇప్పటికీ మంచి స్నేహితులు. విడాకులు తీసుకున్నంతమాత్రాన తాము శత్రువులుగా మారిపోలేదని, తనంటే ఇప్పటికీ ఎంతో గౌరవం అంటున్నాడు జావెద్‌. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హుందాగా, తెలివిగా వ్యవహరించి ఉంటే మా కథ వేరేలా ఉండది. కానీ ఈ వ్యసనమే (మందు తాగే అలవాటు) మా రిలేషన్‌ను ముక్కలు చేసింది.


కూతురు జోయా, కుమారుడు ఫర్హాన్‌ అక్తర్‌లతో హనీ

పదేళ్లు భరించింది.. ఈ తాగుడు వల్లే
ఆమె చాలా అద్భుతమైన మనిషి. ఎంతో మంచి వ్యక్తి. తనపై నాకు ఇప్పటికీ అంతే గౌరవం ఉంది.. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము ఇప్పటికీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాము. మేము పెళ్లి చేసుకున్నా మొదటి పదేళ్లు నన్ను ఎలాగోలా భరించింది. కానీ తనకూ అనిపిస్తుంది కదా.. ఇలాంటి తాగుబోతు భర్తగా దొరికాడేంటి? అని! ఒకానొక రోజు మందు మానేద్దామని డిసైడయ్యాను. అప్పటినుంచి మళ్లీ దాని జోలికే పోలేదు' అని చెప్పుకొచ్చాడు.

రెండో పెళ్లి
కాగా జావెద్‌- హనీ 1972లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఫర్హాన్‌ అక్తర్‌, జోయా అక్తర్‌ అని ఇద్దరు పిల్లలు సంతానం. 1985లో జావెద్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరవడానికి ముందే అతడు తన క్లోజ్‌ ఫ్రెండ్‌, నటి షబానా అజ్మీని పెళ్లాడాడు. ప్రస్తుతం ఇతడు లాహోర్‌ 1947 సినిమాకు పాటలు రాస్తున్నాడు.

చదవండి:  రెండు ఓటీటీల్లో హనుమాన్‌.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement