రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త
తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్‌లో రాస్తూ..'జోయా, రణ్‌వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్‌బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు.
యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్‌లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగానే.
Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it…
— Animal The Film (@AnimalTheFilm) January 7, 2024
Comments
Please login to add a commentAdd a comment