పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత... | javed akhtar 12 years after two films | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత...

Published Thu, Mar 24 2016 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత... - Sakshi

పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత...

కొందరు నేతలు ‘భారత మాతా కీ జై’ అనడానికి నిరాకరించినందుకు విమర్శించి, వార్తల్లో  నలుగుతున్న బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ దాదాపు 12 ఏళ్ల తర్వాత రెండు సినిమాల స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘లక్ష్య్’ తర్వాత ఏ చిత్రానికీ జావేద్ రచయితగా పని చేయలేదు. అయితే ఇప్పుడు సామాజిక సమస్యలే ఇతివృత్తంగా ఓ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు.
 
 పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పులపాలై, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్నే స్క్రిప్ట్‌గా మార్చే పనుల్లో ఉన్నారు జావేద్. అలాగే, 1947లో ఇండియన్  హాకీ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకున్న సంఘటనను కూడా సినిమా స్క్రిప్ట్‌గా మారుద్దామని జావేద్ ప్లాన్. ఇంకేం! ఆల్ ది బెస్ట్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement