![A superstar is trying to put me behind bars, says kangana - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/11/kangana-ranaut.jpg.webp?itok=RqGzzHM-)
కంగానా రనౌత్ మళ్లీ బాంబ్ పేల్చారు. హృతిక్ రోషన్‌తో వివాదాన్ని అంత ఈజీగా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఓ సూపర్‌స్టార్ తనను జైలుకు వెనుకకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా హృతిక్‌ను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు.
'ఫిట్ టు ఫైట్' ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'నా చెల్లెలు పాఠశాలలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థి నుంచి ఆమె యాసిడ్ దాడి ఎదుర్కొంది. ఇప్పుడు సినీ రంగంలో కొనసాగుతుండగా.. ఓ సూపర్‌స్టార్ నన్ను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మన సమాజంలో సహజంగా జరిగేదే' అని ఆమె అన్నారు.
పద్మావతి సినిమా వివాదంపై కూడా ఆమె స్పందించారు 'ఇది నిజానికి చాలా పెద్ద తప్పిదం. కానీ, ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు నాకు అనిపిస్తుంది' అని అన్నారు. హృతిక్-కంగన మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment