ఆమె రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది! | Kangana sent sexually explicit emails: Hrithik Roshan | Sakshi
Sakshi News home page

ఆమె లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది!

Published Tue, Oct 3 2017 9:43 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana sent sexually explicit emails: Hrithik Roshan - Sakshi

బాలీవుడ్‌ను కుదిపేసిన హృతిక్‌ రోషన్‌-కంగనా రనౌత్‌ డర్టీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రిపబ్లిక్‌ టీవీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కంగనపై గత ఏడాది ఏప్రిల్‌లో హృతిక్‌ లాయర్‌ మహేశ్‌ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెలికితీసి.. రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసింది. హృతిక్‌ చేసిన ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. కంగనను తనను వెంటాడి... వేధించిందని, ఆమె నిత్యం తన వెంటపడేదని హృతిక్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కంగన తనకు లైంగికపరమైన ఈమెయిల్స్‌ పంపేదని, తనను ఆమె 'శాశ్వత ప్రేమికుడి'గా అభివర్ణించేదని తెలిపాడు.

2009లో 'కైట్స్‌' సినిమా ప్రారంభానికి ముందు కంగనను తొలిసారి కలిశానని, ఆ తర్వాత ఇద్దరం కలిసి 'కైట్స్‌' సినిమాలో నటించామని, 'క్రిష్‌-3' సినిమాలో కలిసి నటించినప్పటికీ ఆ తర్వాత తమ మధ్య స్నేహం లేదని హృతిక్‌ తెలిపాడు. 2009, 2013లో వృత్తిపరమైన కారణాల వల్లే తాను కంగనను పలుసార్లు కలిశానని, కానీ 2014లో ఆమె నుంచి అసభ్యమైన, దూషిస్తూ తనకు మెసేజ్‌లు వచ్చాయని హృతిక్‌ పేర్కొన్నాడు. అంతేకాకుండా కంగనను మానసికంగా, భావోద్వేగపరంగా హృతిక్‌ రేప్‌ చేశాడని ఆరోపిస్తూ.. ఆమె సోదరి రంగోళీ నుంచి కూడా మెయిల్‌ వచ్చిందని ఫిర్యాదులో తెలిపాడు.

హృతిక్‌ను ఉద్దేశించి 'సిల్లీ ఎక్స్‌' అంటూ కంగనను అభివర్ణించడంతో ఇద్దరి మధ్య గొడవ చినికిచినికి లీగల్‌ పోరాటం వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా 'సిమ్రన్‌' సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా కూడా కంగన ఈ వివాదంపై స్పందించింది. హృతిక్‌ ఫిర్యాదు పాతదేనని, టీఆర్పీ రేటింగ్స్‌ కోసమే రిపబ్లిక్‌ టీవీ దీనిని మళ్లీ వెలికితీసి ప్రసారం చేసిందని కంగన లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీ విమర్శించారు. కంగన ఆ వివాదాన్ని దాటి ముందుకెళ్లిపోయిందని సోదరి రంగోళీ ట్వీట్‌ చేసింది. స్టాకర్‌ అంకుల్‌ ఇప్పటికైనా తన భార్యాపిల్లల మీద ఫోకస్‌ చేయాలంటూ హృతిక్‌ను చురకలు అంటించింది.

1
1/1

కంగన-హృతిక్‌ (ఫైల్‌ఫొటో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement