ఎవరి మద్దతు అవసరం లేదన్న హీరో | Truth is on my side, don’t need support from Bollywood: Hrithik Roshan | Sakshi
Sakshi News home page

ఎవరి మద్దతు అవసరం లేదన్న హీరో

Published Wed, Jul 13 2016 9:29 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

ఎవరి మద్దతు అవసరం లేదన్న హీరో - Sakshi

ఎవరి మద్దతు అవసరం లేదన్న హీరో

ముంబై: హీరోయిన్ కంగనా రౌనత్ తో తలెత్తిన వివాదంపై హీరో హృతిక్ రోషన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. న్యాయం తన పక్షాన ఉందని, తనకు ఎవరి మద్దతు అవసరం లేదని అన్నాడు. తన తాజా చిత్రం 'మొహంజోదారో' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హృతిక్ రోషన్ను కంగనా రౌనత్తో వివాదం గురించి ప్రశ్నించగా... 'న్యాయం మీ పక్షాన ఉంటే, మీకు ఎవరి మద్దతు అవసరం ఉండదు' అని జవాబిచ్చాడు.

ఈ వివాదంతో మీ ఆన్స్క్రీన్ ఇమేజ్ దెబ్బతిందని భావిస్తున్నారా అని అడగ్గా... 'ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. మొహంజోదారో సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. వ్యక్తిగత విషయాలకు ఇక్కడ తావులేద'ని స్పష్టం చేశాడు.

హృతిక్ రోషన్, కంగనా రౌనత్ ప్రేమ వ్యవహారం రచ్చకెక్కి కోర్టుల దాకా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కంగనాకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు బాసటగా నిలవగా, 'క్రిష్' స్టార్కు బహిరంగంగా ఎవరు మద్దతు తెలపలేదు. దీనిపై అతడు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో హృతిక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement