క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్‌ | Kangana Ranaut Has Apologized To Javed Akhtar | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్‌

Published Sat, Mar 1 2025 11:58 AM | Last Updated on Sat, Mar 1 2025 1:17 PM

Kangana Ranaut Has Apologized To Javed Akhtar

ప్రసిద్ధ కవి, సినీ పాటల రచయిత జావెద్‌ అక్తర్‌(Javed Akhtar)కి బాలీవుడ్‌ హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut) క్షమాపణలు చెప్పింది. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య వ్యవహారంలో అనవసరంగా పేరు ప్రస్తావించి తన పరువు  ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ 2020లో కంగనాపై జావెద్‌ పరవునష్టం దావా వేశారు. ఒక సహ నటుడికి క్షమాపణ చెప్పాలంటూ జావెద్‌ 2016లో తనను బెదిరించారని, గౌరవానికి భంగం కలిగించారని కంగన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే తాజాగా వీరిద్దరు రాజీ కుదుర్చుకున్నారు.  ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఇద్దరు సినీ ప్రముఖులూ శుక్రవారం హాజరై పరస్పర ఫిర్యాదులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. న్యాయస్థానం కూడా వీరిద్దరి నిర్ణయానికి అంగీకారం తెలిపింది. 

(చదవండి: సీరియస్ ప్రశ్న.. విష్ణు ఫన్నీ ఆన్సర్)

‘ఈరోజు నేను, జావెద్‌ న్యాయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నాం. ఆయన ఎంతో దయతో హుందాగా వ్యవహరించారు. నేను దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రానికి పాటలు రాయడానికి కూడా అంగీకరించారు’’ అని రనౌత్‌ ప్రకటించారు.

‘కంగనా నాకు క్షమాపణలు కోరింది. మరోసారి ఇలాంటివి పునరావృతం చేయనని చెప్పింది. అందుకే కేసు విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఆమె కూడా నాపై పెట్టిన కేసును వాపసు తీసుకుంది’ అని  జావెద్‌ అక్తర్‌ చెప్పారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement